Home Remedies:1 సారి ఈ పాలను తాగితే దగ్గు,గొంతునొప్పి,గొంతు సమస్యలు లేకుండా రోగనిరోదకశక్తిని పెంచుతుంది
Cold And Cough Home Remedies : ప్రస్తుతం వాతావరణం చాలా చల్లగా ఉండటమే కాకుండా విపరీతమైన మంచు కూడా ఉంది. ఈ మంచులో బయటకు వెళ్లామంటే చాలు గొంతు నొప్పి, దగ్గు, జలుబు వంటివి వచ్చేస్తాయి. ఇవి ఒక పట్టానా తగ్గవు. ప్రారంభ దశలోనే వీటిని తగ్గించుకోవాలి.
ప్రారంభ దశలో ఇంటి చిట్కాలతో తగ్గించుకోవచ్చు. ఇంటి చిట్కాలు చాలా సమర్ధవంతంగా పనిచేస్తాయి. పొయ్యి మీద ఒక గ్లాస్ పాలను పెట్టి కాస్త వేడి అయ్యాక దానిలో అరస్పూన్ జీలకర్ర, నాలుగు మిరియాలను దంచి వేయాలి. ఆ తర్వాత పావుస్పూన్ పసుపు వేయాలి. నాలుగు నిమిషాలు మరిగాక ఒక స్పూన్ బెల్లం వేసి ఒక నిమిషం మరిగించాలి.
ఈ పాలను వడకట్టి ఉదయం,సాయంత్రం తాగితే రెండు రోజుల్లోనే మంచి ఉపశమనం కలుగుతుంది. డయబెటిస్ ఉన్నవారు బెల్లం లేకుండా తాగాలి. ఈ పాలను గోరువెచ్చగా ఉన్నప్పుడే తాగాలి. ఈ పాలను తయారుచేసుకోవటం చాలా సులువు. అయితే కాస్త సమయాన్ని కేటాయిస్తే సరిపోతుంది. మిరియాలు,పసుపు,జీలకర్రలో ఉన్న పోషకాలు దగ్గును తగ్గిస్తాయి.
శరీరంలో రోగనిరోదక వ్యవస్థను బలోపేతం చేస్తాయి. శరీరంలో వ్యర్ధాలు బయటకు పోయేలా చేస్తాయి. అలాగే అధిక బరువు సమస్య నుండి కూడా బయటపడవచ్చు. ఈ కాలంలో ఈ పాలను తయారుచేసుకొని తాగి చలికాలంలో వచ్చే వ్యాధుల బారిన పడకండి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.