Kitchenvantalu

Flax Seeds Powder:ఇలా పొడి చేసి రోజూ ఒక ముద్ద తింటే మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే..

Flax Seeds Powder Recipe: కొన్ని కొన్ని సార్లు ఎన్ని వెరైటీ రెసిపీస్ ఉన్నా మనసు పచ్చళ్ళు,పొడుల వైపు వెలుతుంది. వేడి వేడి అన్నంలో కారంపొడి, కాసింత నెయ్యి తగిలిస్తే ఆ మజానే వేరు. అవిసగింజలతో కారం తయారు చేసి పెట్టుకోండి.అద్భుతంగా ఉంటుంది.

కావాల్సిన పధార్ధాలు
నూనె- 2 టేబుల్ స్పూన్స్
అవిసెగింజలు- ½ కప్పు
ఎండుమిర్చి- 17-20
పచ్చి శెనగపప్పు- 1 టేబుల్ స్పూన్
పొట్టు మినపప్పు- 1 టేబుల్ స్పూన్
జీలకర్ర- 1 టీస్పూన్
ధనియాలు- 2 టేబుల్ స్పూన్స్
వెల్లుల్లి- 7-8
చింతపండు- ఉసిరికాయంత
ఉప్పు- తగినంత

తయారి విధానం
1.స్టవ్ పై బాండీ పెట్టుకోని నూనె వేడి చేసుకోని అవిసె గింజలు వేసి లో ఫ్లేమ్ పై దోరగా వేయించి పక్కనపెట్టుకోవాలి.
2.అదే ప్యాన్ లో కాస్తే నూనె వేసి వేడెక్కాక అందులోకి పచ్చిమిర్చి,శెనగపప్పు,పొట్టు మినపప్పువేసి దోరగా వేయించుకోవాలి.
3.పప్పులు వేగాక అందులోకి జీలకర్ర,ధనియాలు వేసి ఎర్రగా వేపి పక్కన పెట్టుకోవాలి.

4.తరువాత అదే ప్యాన్ ఎండుమిర్చి వేసి రెండు నిమిషాలు వేపుకోవాలి.వేగిన ఎండుమిర్చిలో వెల్లుల్లి వేసుకోని కాసేపు వేపాలి.
5.వేపుకున్న పధార్ధాలన్ని చల్లారాక,మిక్సి జార్ లో వేసి చింతపండు,ఉప్పు వేసుకోని గ్రైండ్ చేసుకోవాలి.కాస్తా బరకగా ఉంటే ఇడ్లీలోకి బాగుంటుంది.అన్నంలోకి అయితే కాస్త మెత్తగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది.
Click Here To Follow Chaipakodi On Google News