Apricot:రోజుకి 2 నీటిలో నానబెట్టి తింటే రోగ నిరోధక శక్తి పెరిగి రక్తహీనత,జీర్ణ సమస్యలు ఉండవు
Apricot benefits in telugu : ఆప్రికాట్ రోసేసి కుటుంబానికి చెందినది. ఆప్రికాట్ పండుగా ఉన్నప్పుడు మాత్రమే కాదు డ్రై అయిన తర్వాత కూడా పోషకాలు అలానే ఉంటాయి. ఈ పండ్లు తీయగా మరియు మెత్తగా ఉంటాయి. అప్రికాట్స్ సాధారణంగా నారింజ లేదా పసుపు రంగులో ఉంటూ కొద్దిగా ఎరుపురంగుతో కూడి ఉంటుంది.
ఆప్రికాట్ లో క్యాల్షియం, పొటాషియం, ఫాస్పరస్, విటమిన్ ఎ, ఐరన్ విటమిన్ సి పుష్కలంగా ఉన్నాయి. ఒక కప్పు డ్రై ఆప్పికాట్ లో 158మైక్రోగ్రామ్ విటమిన్ ఎ ఉంటుంది. ప్రతి రోజు ఒక ఆప్రికాట్ తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అనీమియాతో బాధపడేవారికి ఆప్రికాట్ దివ్య ఔషధం అని చెప్పవచ్చు. రక్తహీనతతో బాధపడేవారు క్రమం తప్పకుండా తింటే మంచి ఫలితం కలుగుతుంది.
ఆప్రికాట్ లో ఉండే కాపర్ ఐరన్ గా శరీరం శోషించుకుంటుంది. హిమగ్లోబిన్ ఉత్పత్తి కూడా బాగా పెరుగుతుంది. దాంతో రక్తహీనత సమస్య నుండి బయట పడతారు. అప్రికాట్ లో సెల్యులోజ్ కరగని ఫైబర్ మరియు పెక్టిన్ సమృద్దిగా ఉండుట వలన శరీరంలో నీటి నిల్వలను బ్యాలెన్స్ చేయటమే కాకుండా మలబద్దక సమస్యను తొలగిస్తుంది.
భోజనం చేయటానికి ముందు ఒక అప్రికాట్ తింటే జీర్ణక్రియకు బాగా సహాయపడుతుంది. అప్రికాట్ లో ఉండే ఆల్కలైన్ మరియు న్యూట్రలైజ్ యాసిడ్స్ జీర్ణక్రియలో సహాయపడతాయి. జ్వరం వచ్చినప్పుడు అప్రికాట్ జ్యూస్ త్రాగితే ఉపశమనం కలుగుతుంది. అలాగే దాహాన్ని కూడా తీర్చుతుంది.
అప్రికాట్, విటమిన్ సి, విటమిన్ ఎ మరియు ఫైటోన్యూట్రియంట్స్ సమృద్ధిగా ఉండుట వలన ఆరోగ్యవంతమైన మరియు మృదువుగా ఉండే చర్మాన్ని ప్రోత్సహిస్తుంది. అప్రికాట్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ కూడా వృద్దాప్య చాయలను నెమ్మదించడంలో సహాయపడతాయి.ఎక్జిమా, దురద, తామర వంటి చర్మ సమస్యలను పరిష్కారం చేస్తుంది.
పెద్ద ప్రేగులను శుభ్రం చేయటానికి మరియు పెద్దపేగుల్లో నిల్వ ఉన్న వ్యర్థాలను బయటకు నెట్టివేయడానికి అద్భుతంగా సహాయపడుతుంది.పురాతన కాలం నుండి అప్రికాట్ ని గర్భధారణ కొరకు ఉపయోగించేవారు. ముఖ్యంగా సంతాన లోపాలకు ఉపయోగించేవారు. అలాగే పాలిచ్చే తల్లులకు కూడా బాగా సహాయపడుతుంది. వీటిని నానబెట్టి తింటే వంద శాతం పోషకాలు అందుతాయి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.