Red Guava :ఎర్ర జామపండు ఎప్పుడైనా తిన్నారా…ఈ విషయం తెలిస్తే అసలు వదిలిపెట్టరు
Red Guava Benefits in telugu: మనలో చాలా మందికి ఎర్ర జామకాయ గురించి పెద్దగా తెలియదు. ఈ జామపండులో ఎన్నో పోషకాలు,ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. రోజుకి ఒక ఎర్ర జామపండు తింటే ఎన్నో ఊహించని ప్రయోజనాలను పొందవచ్చు. ఈ పండులో ఫైబర్ సమృద్దిగా ఉండుట వలన రక్తంలో చెడు కొలెస్ట్రాల్ ని తగ్గించటమే కాకుండా చక్కెర స్థాయిలను కూడా నియంత్రణలో ఉంచుతుంది.
మెగ్నీషియం సమృద్దిగా ఉండుట వలన కండరాల తిమ్మిరి తగ్గించటమే కాకుండా కండరాలు ఒత్తిడికి గురికాకుండా కాపాడుతుంది. విటమిన్ సి సమృద్దిగా ఉండుట వలన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి ఎటువంటి ఇన్ ఫెక్షన్స్ రాకుండా శరీరాన్ని కాపాడుతుంది. విటమిన్ ఏ, ప్లేవనాయిడ్స్ అయిన బీటాకెరోటిన్లైకోపిన్ ఉండుట వలన లంగ్స్, చర్మం ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది.
పొటాషియం సమృద్దిగా ఉండుట వలన రక్త ప్రవాహం బాగా సాగేలా చేసి రక్తపోటు నియంత్రణలో ఉండేలా చేసి గుండె ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. ఈ పండు తింటే అలసట,నీరసం తగ్గి చురుకుగా ఉంటారు. బీ కాంప్లెక్స్ విటమిన్స్ ఉండుట వలన రక్తకణాల వృద్దికి సహాయపడుతుంది. అధిక బరువు సమస్య నుండి బయట పడవచ్చు.
ఎర్ర జామపండులో ఉన్న ప్రయోజనాలు తెలిసాయి కదా…ఈ పండు కనపడితే తప్పనిసరిగా తిని ఇప్పుడు చెప్పిన ప్రయోజనాలను పొందండి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.