Lizards In Home : బల్లులు మీ ఇంట్లో నరకం చూపిస్తున్నాయా.. ఇలా చేస్తే ఒక్క బల్లి కూడా ఉండదు..!
Lizards In Home remedies : ప్రతి ఇంటిలోనూ బల్లులు ఉండటం సహజమే. వీటితో మనుషులకు పెద్దగా ప్రమాదం లేదు. పైగా ఇంట్లోని కీటకాలను తింటూ మనకే మేలుచేస్తాయి. అయినా మనలో చాలా మందికి బల్లులంటే నచ్చదు. వాటిని చూస్తేనే భయమేస్తుంది. ఒళ్లు జలదరిస్తుంది. మార్కెట్ లో వివిధ రకాల స్ప్రేలు అందుబాటులో ఉన్నప్పటికి వాటిలో రసాయనాలు ఉండుట వలన కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది.
అలాంటి బల్లులను ఇంటి నుంచి తరిమికొట్టటానికి ఇంటి చిట్కాలు చాలా సమర్ధవంతంగా పనిచేస్తాయి. బల్లులు ఉన్న ప్రదేశంలో కాఫీ పొడి జల్లవచ్చు. లేకపోతే కాఫీ పొడిలో నీటిని కలిపి spray చేయవచ్చు.
ఉల్లిపాయ కూడా బల్లులను తరిమికొట్టటానికి చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఘాటైన ఉల్లి వాసనంటే బల్లులకు పడదు. ఉల్లిరసాన్నిగోడలపై స్ప్రే చేస్తే బల్లులు వెళ్లిపోతాయి. ఉల్లిపాయను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి కిటికీలు, మూలల్లో ఉంచినా సరిపోతుంది.
వెల్లుల్లి వాసన కూడా బల్లులకు నచ్చదు. అందువల్ల బల్లులు ఉన్న ప్రదేశంలో వెల్లుల్లి రెబ్బలను పెట్టవచ్చు. లేదా వెల్లుల్లి రసాన్ని నీటిలో కలిపి బాటిల్ లో పోసి spray చేస్తే సరిపోతుంది.
పొయ్యి మీద గిన్నె పెట్టి నీటిని పోసి వేడి చేయాలి. ఈ నీటిలో ముద్ద కర్పూరాన్ని పొడిగా చేసి వేసి బాగా కలిపి స్ప్రే బాటిల్ లో పోసి బల్లులు ఉన్న ప్రదేశంలో స్ప్రే చేస్తే కర్పూరం వాసనకు బల్లులు పారిపోతాయి.
ఒక గిన్నెలో అర చెక్క నిమ్మరసం,అర టీ స్పూన్ డెటాల్,అర టీ స్పూన్ లైజాల్ ను వేసి బాగా కలిపి స్ప్రే బాటిల్ లో పోసి బల్లులు ఉన్న ప్రదేశంలో స్ప్రే చేస్తే బల్లులు పారిపోతాయి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
Click Here To Follow Chaipakodi On Google News