Kitchenvantalu

Kitchen Hacks: ఈ చిట్కా పాటిస్తే కొబ్బరి చిప్ప నుండి ఈజీగా కొబ్బరిని తీయవచ్చు

Coconut Removing Tips in telugu: మనం పచ్చి కొబ్బరిని ఎక్కువగానే వాడుతూ ఉంటాం. పచ్చి కొబ్బరిలో ఎన్నో పోషకాలు, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అయితే కొబ్బరి చిప్ప నుండి కొబ్బరిని తీయటం కొంచెం కష్టమైన పనే. అయితే ఇప్పుడు చెప్పే చిట్కాలను ఫాలో అయితే చాలా ఈజీగా కొబ్బరి చిప్ప నుండి కొబ్బరిని తీయవచ్చు.

ముందుగా కొబ్బరికాయ పీచు తీసి సగం అయ్యేలా పగలకోట్టాలి. అయితే కొబ్బరికాయను పగలకొట్టటానికి ముందు ఒక చిట్కా పాటించాలి. కొబ్బరికాయను పగలగొట్టే ముందు తొక్క తీసి 30 నుంచి 40 నిమిషాల పాటు ఫ్రిజ్‌లో ఉంచాలి. ఇలా చేస్తే కొబ్బరికాయ పగలడంతో కొబ్బరికాయ విడిపోతుంది.

ఒకవేళ ఫ్రిజ్ లేకపోతే కొబ్బరికాయను వేడి నీటిలో అరగంట సేపు ఉంచాలి. అలా వేడి నీటిలో ఉంచటం వలన పెంకు మరియు కొబ్బరి కాయలు వేరు చేయబడతాయి. పగిలిన కొబ్బరి ముక్కలను 30 నుంచి 40 నిమిషాల పాటు ఎండలో ఉంచితే కొబ్బరికాయ విడిపోతుంది. పొయ్యి మీద 5 నుంచి 10 నిమిషాల పాటు ఉంచితే చాలా సులభంగా కొబ్బరి చిప్ప నుండి కొబ్బరి విడిపోతుంది.

ఇప్పుడు చెప్పిన చిట్కాలు అన్ని బాగా పనిచేస్తాయి. మీకు వీలును బట్టి ఈ చిట్కాలను ఫాలో అయ్యి కొబ్బరి చిప్ప నుంచి కొబ్బరిని వేరు చేయండి. కొబ్బరి పచ్చడి, కోకనట్ రైస్ వంటి ఎన్నో రకాల వంటలను చేసుకుంటూ ఉంటాం.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.
Click Here To Follow Chaipakodi On Google News