Guntur Kaaram OTT Release Date: గుంటూరు కారం ఓటీటీ డేట్ వచ్చేసింది!
Guntur Kaaram: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వచ్చిన గుంటూరు కారం సినిమా సంక్రాంతి కానుకగా అభిమానుల ముందుకు వచ్చింది. ఇక ఇప్పుడు ఓటీటీలో సందడి చేయటానికి సిద్దం అయింది.
ఈ సినిమా సంక్రాంతి బరిలో మొదట రిలీజైనప్పటికి దర్శక, నిర్మాతలకు నిరాశను మిగిల్చింది. మిక్స్ డ్ టాక్ రావడంతో థియేటర్లకు వెళ్లి చూసేందుకు ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి చూపలేదు.
దాంతో ఎక్కువ రోజులు థియేటర్లలో ఆడలేదు. దాంతో చాలా తొందరగా OTT లోకి వచ్చేస్తుంది. మహేశ్ బాబును మాస్ క్యారెక్టర్ లో ప్రేక్షకులు రిసీవ్ చేసుకోలేదు.
సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా, శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా తెరకెక్కిన గుంటూరు కారం సినిమాప్రముఖ సంస్థ నెట్ ఫ్లిక్స్ లో ఈ నెల 9 నుంచి ప్రసారం కానుంది. స్ట్రీమింగ్ డేట్ ను అనౌన్స్ చేశారు మూవీ మేకర్స్.
మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన మూడో సినిమా గుంటూరు కారం అభిమానులను నిరాశ పరచింది. మొదటి సినిమా అతడు సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత సినిమా ఖలేజా నిరాశ పరచింది.