Healthhealth tips in telugu

Neem and turmeric:వేప+పసుపు కలిపి వాడితే ఊహించని ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి…ఇది నిజం

Neem and turmeric Benefits in telugu : వేప,పసుపు రెండింటిలోను ఎన్నో పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ రెండింటినీ పురాతన కాలం నుండి వాడుతున్నారు. ఈ రెండింటినీ కలిపి తీసుకుంటే రెట్టింపు ఆరోగ్య, బ్యూటీ ప్రయోజనాలను పొందవచ్చు. పొయ్యి మీద గిన్నె పెట్టి ఒక గ్లాస్ నీటిని పోసి దానిలో 5 వేప ఆకులను, చిటికెడు పసుపు వేసి 5 నిమిషాల పాటు మరిగించి వడకట్టి ఉదయం సమయంలో తాగాలి.

ఈ నీటిని ప్రతి రోజు తాగితే శరీరాన్ని డిటాక్సిఫై చేసి శరీరంలో వ్యర్ధాలను,మలినాలను బయటకు పంపి అంతర్గతంగా శుభ్రం చేస్తుంది. డయాబెటిస్ ఉన్నవారు తాగితే డయాబెటిస్ నియంత్రణలో ఉంటుంది. డయాబెటిస్ ఉన్నవారు మందులు వాడటం మానకూడదు. శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.

సీజన్ మారినప్పుడు వచ్చే దగ్గు,జలుబు,గొంతు నొప్పి, గొంతు ఇన్ ఫెక్షన్ వంటి వాటిని తగ్గిస్తుంది. వేప ఆకుల పేస్ట్ లో పసుపు కలిపి ముఖానికి రాసి పది నిమిషాలు అయ్యాక ముఖాన్ని చల్లని నీటితో శుభ్రం చేసుకుంటే చర్మం మీద మృత కణాలు తొలగిపోవటమే కాకుండా మొటిమలు కూడా తగ్గిపోతాయి.

గోరువెచ్చని నీటిలో వేపాకులు,పసుపు వేసి స్నానం చేస్తే చర్మ ఎలర్జీలు తొలగిపోతాయి. కుంకుడు కాయ రసంలో వేపాకుల నీటిని కలిపి తలస్నానం చేస్తే జుట్టు రాలే సమస్య, చుండ్రు సమస్య తగ్గుతాయి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.