White Hair: తెల్లజుట్టు ఉందా? టీ డికాషన్ తో ఇలా చేస్తే నల్లగా నిగనిగలాడాల్సిందే..!
Tea And Henna White hair Home Remedies : తెల్లజుట్టు అనేది చాలా చిన్న వయస్సులో రావటం వలన చాలా కంగారూ పడి మార్కెట్ లో దొరికే రకరకాల ప్రొడక్ట్స్ వాడేస్తూ ఉంటారు. అలా కాకుండా సహజసిద్దమైన పదార్ధాలతో తెల్లజుట్టును నల్లగా మార్చుకోవచ్చు.
దీని కోసం ముందుగా టీ డికాషన్ తయారుచేసుకోవాలి. పొయ్యి మీద గిన్నె పెట్టి దానిలో నీటిని పోసి ఒక స్పూన్ టీ పొడి, 4 లవంగాలు వేసి 5 నిమిషాలు మరిగించాలి. ఈ టీ డికాషన్ వడకట్టి పక్కన పెట్టాలి. ఆ తర్వాత ముకుడులో ఒక స్పూన్ ఉసిరి పొడి వేసి బాగా రంగు మారేవరకు వేగించి పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు ఒక బౌల్ లో ఒక స్పూన్ హెన్నా పొడి, వేగించిన ఉసిరి పొడి,ఒక స్పూన్ ఇండిగో పొడి, చిన్న స్పూన్ కాఫీ పొడి, ఒక స్పూన్ పెరుగు, టీ డికాషన్ వేసి అన్నీ బాగా కలిసేలా కలపాలి.
ఈ మిశ్రమాన్ని జుట్టుకి పట్టించి గంట అయ్యాక రెగ్యులర్ గా వాడే షాంపూతో తలస్నానం చేయాలి. ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తూ ఉంటే తెల్లజుట్టు నల్లగా మారుతుంది. తెల్లజుట్టు ఎక్కువగా ఉంటే ఎక్కువ వారాల సమయం,తక్కువ తెల్లజుట్టు ఉంటే తక్కువ వారాల సమయం పడుతుంది.
ఈ చిట్కా కాస్త ఓపికగా చేస్తే మంచి ఫలితం తప్పకుండా వస్తుంది. కాబట్టి ఈ చిట్కా ఫాలో అయ్యి తెల్లజుట్టు సమస్య నుండి బయట పడండి. తెల్లజుట్టు నల్లగా మారటమే కాకుండా జుట్టు రాలే సమస్య కూడా తగ్గుతుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.