MoviesTollywood news in telugu

Brahmamudi serial:బ్రహ్మముడి సీరియల్ హీరో మానస్ రియల్ లైఫ్…అసలు నమ్మలేరు

Brahmamudi serial hero manas real life: టివీ సీరియల్స్ లో నటించే నటులు ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. ప్రతి రోజు సీరియల్స్ తో మనల్ని పలకరిస్తూ అలరిస్తూ ఉంటారు.

బ్రహ్మముడి సీరియల్ ప్రారంభం అయినా చాలా తక్కువ సమయంలోనే ప్రేక్షకుల అభిమానాన్ని పొందింది. ఈ సీరియల్ లో రాజ్ పాత్రలో మానస్ నటిస్తున్నాడు. ముంబై లో పుట్టిన మానస్ చదువు అంతా వైజాగ్ లో సాగింది. ముంబైలో పుట్టిన వైజాగ్ లోనే పెరిగాడు.

మానస్ కి నటన మీద ఆసక్తి ఉండటంతో 2001 లో చైల్డ్ ఆర్టిస్ట్ గా పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత కొంతకాలం నటనకు దూరంగా ఉండి…మరల 2014 లో జలక్ అనే సినిమాతో ఇచ్చాడు. ఆ తర్వాత గోలిసోడా,కాయి రాజ కాయి, గ్రీన్ సిగ్నల్ వంటి సినిమాలలో నటించాడు.

అయితే పెద్దగా సినిమాలలో గుర్తింపు రాకపోవటంతో కోయిలమ్మ సీరియల్ తో బుల్లితెరకు ఎంట్రీ ఇచ్చాడు. ఈ సీరియల్ మానస్ కు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత మనసిచ్చి చూడు,దీపారాదన, కార్తీక దీపం సీరియల్స్ లో నటించాడు. ఆ తర్వాత బిగ్ బాస్ లో కూడా మెరిసాడు. ఇక ఇప్పుడు బ్రహ్మముడి సీరియల్ లో రాజ్ వర్ధన్ గా నటిస్తూ ప్రేక్షక అభిమానాన్ని సొంతం చేసుకుంటున్నాడు.