BusinessEDUCATION

CBSE Admit Card 2024 : CBSE 10, 12 అడ్మిట్​ కార్డులను ఇలా డౌన్​లోడ్​ చేసుకోండి

How to download CBSE Admit Card 2024 : CBSE క్లాస్​ 10, క్లాస్​ 12 పరీక్షలు..త్వరలో ప్రారంభం కానున్నాయి. సీబీఎస్​ఈ క్లాస్​ 10 ఫైనల్​ పరీక్షలు.. ఈ నెల 15న ప్రారంభం అయ్యి మార్చి 13 తో ముగుస్తాయి.

CBSE క్లాస్​ 12 పరీక్షలు..ఫిబ్రవరి 15న ప్రారంభం అయ్యి ఏప్రిల్​ 2తో ముగుస్తాయి. రెండు బోర్డ్​ ఎగ్జామ్స్​ కూడా.. సింగిల్​ షిఫ్ట్​లో (ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1:30 నిమిషాల వరకు) నిర్వహిస్తారు.

అయితే CBSE 10, 12 అడ్మిట్​ కార్డులను ఎలా డౌన్​లోడ్​ చేసుకోవాలో చూద్దాం.

Step​ 1:- CBSE అధారిక వెబ్​సైట్​ cbse.gov.in లోకి వెళ్లండి.

Step​ 2:- హోం పేజ్​లో కనిపించే పరిక్షా సంఘం లింక్​ మీద క్లిక్​ చేయండి.

Step 3:- కొత్త పేజ్​ ఓపెన్​ అవుతుంది. అందులో వివిధ స్కూల్స్​కి సంబంధించిన లింక్స్​ ఉంటాయి. మీ స్కూల్​ లింక్​ మీద క్లిక్​ చేయాలి.

Step 4:- అందులోని ప్రీ ఎగ్జామ్​ యాక్టివిటీస్​ అనే లింక్​ మీద క్లిక్​ చేయాలి. ఓ కొత్త పేజ్​ ఓపెన్​ అవుతుంది.

Step​ 5:- అక్కడ కనిపించే.. సీబీఎస్​ఈ అడ్మిట్​ కార్డ్​ 2024 లింక్​ మీద క్లిక్​ చేయండి.

Step 6:- మీ లాగిన్​ వివరాలను ఎంటర్​ చేసి, సబ్మిట్​ బటన్​ క్లిక్​ చేయండి.

Step 7:- స్క్రీన్​ మీద మీ అడ్మిట్​ కార్డు డిస్​ప్లే అవుతుంది.

ఈ CBSE అడ్మిట్​ కార్డులపై అభ్యర్థి పేరు, రోల్​ నెంబర్​, ఎగ్జామినేషన్​ సెంటర్​ పేరు, రిపోర్టింగ్​ టైమ్​, గార్డియన్​ పేరు, పీడబ్ల్యూడీ కేటగిరీ, సబ్జెక్ట్స్​, ఎగ్జామ్​ డేట్​ వంటివి ఉంటాయి. వాటిని కచ్చితంగా చెక్​ చేసుకోవాలి.