sprouted peanuts:మొలకెత్తిన వేరుశనగలను తింటే ఎన్నో ఉహించని ప్రయోజనాలు…
Health benefits of sprouted peanuts : మనలో చాలా మంది వేరుశనగలను ఉడికించి లేదంటే వేగించి లేదంటే నానబెట్టి తింటూ ఉంటారు. అలా కాకుండా వేరుశనగలను మొలకలుగా తింటే ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు. ఈ ప్రయోజనాలు తెలిస్తే అసలు వదిలిపెట్టకుండా తినటం అలవాటుగా చేసుకుంటారు. వారంలో మూడు సార్లు తింటే సరిపోతుంది.
మొలకెత్తిన వేరుశనగలు గుండెకు చాలా మేలును చేస్తాయి. ఇందులో ఉండే మెగ్నీషియం, పొటాషియం రక్తప్రసరణ బాగా జరిగేలా చేసి చెడు కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉండేలా చేసి… రక్త పోటు నియంత్రణలో ఉంచి గుండె ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. అధిక బరువు సమస్యతో బాధపడుతున్న వారు మొలకెత్తిన వేరుశనగలు మంచి ఆహార ఎంపిక అని చెప్పవచ్చు.
మొలకెత్తిన వేరుశనగలలో ఫైబర్ సమృద్ధిగా ఉండటం వలన జీవక్రియ రేటును వేగవంతం చేసి బరువు తగ్గించడానికి సహాయపడుతుంది. అలాగే ఒమేగా3 కొవ్వు ఆమ్లాలు సమృద్ధిగా ఉండటం వలన బరువు తగ్గడానికి చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది.డయాబెటిస్ ఉన్న వారు కూడా ఈ మొలకెత్తిన వేరుశనగలను తీసుకోవచ్చు. వీటిలో మెగ్నీషియం సమృద్ధిగా ఉండటం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉండేలా చేస్తుంది.
Calcium సమృద్ధిగా ఉండటం వలన ఎముకలు బలంగా ఆరోగ్యంగా ఉండేలా చేసి కీళ్ళనొప్పులు, మోకాళ్ళ నొప్పుల నుండి ఉపశమనం కలిగేలా చేస్తుంది. కీళ్ళనొప్పులు, మోకాళ్ల నొప్పులు ఉన్నవారు ప్రతి రోజు మొలకెత్తిన వేరుశనగలను తింటే మంచి ఉపశమనం కలుగుతుంది. ఫైబర్ సమృద్ధిగా ఉండటం వలన జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచి మలబద్ధకం, అజీర్ణం, గ్యాస్, అసిడిటీ వంటి సమస్యలు ఏమీ లేకుండా చేస్తుంది.
అంతే కాకుండా ప్రేగు కదలికలను సులభతరం చేసి పొట్టను శుభ్రం చేస్తుంది. దీనిలో పోలేట్ సమృద్ధిగా ఉంటుంది. అలాగే జుట్టు పెరుగుదలకు సహాయపడే బి విటమిన్లు కూడా పుష్కలంగా ఉంటాయి. అలాగే జుట్టు కుదుళ్లకు బలం చేకూర్చే మెగ్నీషియం కూడా సమృద్ధిగా ఉంటుంది. కాబట్టి మొలకెత్తిన వేరుశనగలను తింటే జుట్టు రాలకుండా ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.