JEE Main Answer Key 2024 : ఏ క్షణమైనా జేఈఈ మెయిన్ సెషన్-1 ఆన్సర్ కీ విడుదల
JEE Main Answer Key 2024 : జేఈఈ మెయిన్ సెషన్-1 2024 ఆన్సర్ కీ కోసం విద్యార్ధులు ఎదురు చూస్తున్నారు. ఆ సమయం ఆసన్నమైంది. ఏ క్షణమైనా ఈ ఆన్సర్ కీని, రెస్పాన్స్ షీట్లను విడుదల చేయనుంది.
ఈ సంవత్సరం జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1వ తేదీ వరకూ నిర్వహించిన జేఈఈ మెయిన్స్ సెషన్-1 పరీక్షలకు సంబంధించిన ప్రొవిజనల్ ఆన్సర్ కీని విడుదల చేసేందుకు జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ఏర్పాట్లు చేస్తోంది.
ఇప్పటికే పరీక్షల నిర్వహణ పూర్తి కావడంతో ఆన్సర్ కీ విడుదల కోసం ఎన్‌టీఏ అన్నీ ఏర్పాట్లు దాదాపు పూర్తి చేసింది. ఆన్సర్ కీ విడుదల కాగానే పరీక్షకు హాజరైన అభ్యర్ధులు https://jeemain.nta.ac.in/ వెబ్ సైట్ నుంచి ఈ ఆన్సర్ కీతో పాటు రెస్పాన్స్ షీట్‌ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
ఈ పరీక్షా ఫలితాలను ఫిబ్రవరి 12న విడుదల చేయబోతోంది. ఏప్రిల్ నెలలో సెషన్-2 పరీక్షలను నిర్వహిస్తారు. ప్రస్తుతం జేఈఈ మెయిన్స్ 2024 సెషన్-2కు సంబంధించిన రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. మార్చి 2వ తేదీ వరకూ దరఖాస్తు చేసుకోవచ్చు.