Semiya Rava Kichidi:అప్పటికప్పుడు 10 నిమిషాల్లో రెడీ అయ్యే సేమియా రవ్వ కిచిడి సూపర్ ఉంటుంది
Semiya Rava Kichidi Recipe: సింపుల్ గా టేస్టీగా ఉండే టిఫిన్స్ అంటే ఉప్మానే ఫస్ట్. అందులో సేమియా తో చేసే ఉప్మా అయితే పిల్లలు మరింత ఇష్టపడతారు. మార్నింగ్స్ ఈజీగా చేసుకునే సేమియా ఉప్మా లేదా సేమియా కిచిడి ఎలా చేసుకోవాలో చూసేద్దాం.
కావాల్సిన పధార్ధాలు
సేమియా- ¼ కప్పు
బొంబాయ్ రవ్వ- ¼ కప్పు
నూనె- 2 టేబుల్ స్పూన్స్
నెయ్యి- 2 టేబుల్ స్పూన్స్
ఉల్లిపాయ చీలికలు- 1 కప్పు
పచ్చిమిర్చి ముక్కలు- 2 టేబుల్ స్పూన్స్
క్యారెట్ ముక్కలు- ¼ కప్పు
ఫ్రెంచ్ బీన్స్- 3
బఠాణీ- 2 టేబుల్ స్పూన్స్
టోమాటో ముక్కలు- 3 టేబుల్ స్పూన్స్
ఆవాలు- 1 టీ స్పూన్
జీలకర్ర- 1 టీ స్పూన్
మినపప్పు- 1 టేబుల్ స్పూన్
పచ్చిశెనగ పప్పు- 1 టేబుల్ స్పూన్
జీడిపప్పు- 10
ఉప్పు- తగినంత
అల్లం తరుగు- 1 టీ స్పూన్
పుదీన- కొద్దిగా
కొత్తిమీర-కొద్దిగా
నీళ్లు- 3 కప్పులు
నిమ్మరంసం- 1 టీస్పూన్
తయారి విధానం
1.స్టవ్ పై ప్యాన్ పెట్టుకోని నెయ్యివేసి కరిగాక అందులో సేమియా వేసుకోని కాస్త రంగు మారేవరకు వేయించుకోవాలి.
2.వేరొక ప్యాన్ ఆయిల్ వేసి వేడిక్కిన తర్వాత అందులోకి జీడిపప్పు వేసి వేపుకోవాలి.
3.తర్వాత ఆవాలు,మినపప్పు,శెనగ పప్పు వేసి తాలింపు బాగా వేగాక జీలకర్ర,కరివేపాకు,ఉల్లిపాయలు కూడ వేసుకోని మెత్తపడేవరకు వేపుకోవాలి.
4.ఉల్లిపాయలు మెత్తపడ్డాక అల్లం తరుగు,క్యారేట్ ముక్కలు,బీన్స్ వేసి మరికాసేపు వేపుకోవాలి.
5.క్యారేట్ ,బీన్స్ వేగాకా నీళ్లు పోసుకోని హై ఫ్లేమ్ పై మరగనివ్వాలి.
6.మరుగుతున్న ఎసరులో వేపుకున్న సేమియా వేసి నెమ్మదిగా కలుపుకోని మూతపెట్టి 7-8 నిమిషాలు ఉడకనివ్వాలి.
7.సేమియా ఉడికిన తర్వాత మూత తీసి చివరిగా కొత్తిమీర,పూదీనా మటన్ మసాలా ,నెయ్యి వేసి మిక్స్ చేసుకోని మరో రెండు నిమిషాలు ఉడకనివ్వాలి.
8.అంతే రెండు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి,నిమ్మరసం ఆడ్ చేసుకోని వేడి వేడిగా సర్వ్ చేసుకోవడమే.
Click Here To Follow Chaipakodi On Google News