Guppedantha manasu serial:“గుప్పెడంత మనసు” సీరియల్ ముగింపు.? 1000 ఎపిసోడ్లు అవ్వగానే…అదే కారణమా.?
Guppedantha manasu serial:స్టార్ మా లో ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ కధ కధనాలతో ప్రేక్షకుల మనస్సును గెలుచుకొని 992 ఎపిసోడ్ లని కంప్లీట్ చేసింది.అయితే చాలా రోజులుగా రిషి కనపడటం లేదు. దాంతో వెయ్యు ఎపిసోడ్ లో గుప్పెడంత మనసుకి శుభం కార్డు పడిపోతుంది అంటున్నారు ప్రేక్షకులు.
నిజానికి సీరియల్ అంటేనే రిషి, జగతి, వసుధార. మొదటగా జగతి క్యారెక్టర్ చనిపోవడం ఇప్పుడు రిషి సీరియల్ లో కనిపించకపోవడంతో టిఆర్పి రేటింగ్స్ బాగా తగ్గిపోయాయి. అలాగే ఒకప్పుడు ప్రైమ్ టైం లో వచ్చిన ఈ సీరియల్ ని ప్రైమ్ టైం నుంచి తప్పించడం కూడా రేటింగ్స్ పడిపోవడానికి కారణమైంది.
రిషి లేకపోవడంతో ఆడియన్స్ కి సీరియల్ పట్ల ఆసక్తి తగ్గిపోయింది. రిషి ఈ సీరియల్ లో కనిపించకపోవటానికి ఎన్నో రకాల కారణాలు వినిపిస్తున్నాయి. రిషి పాత్రలో మరొకరిని ఊహించుకోవటం కష్టమే. ఎన్ని కొత్త పాత్రలు వచ్చిన రిషి లేని లోటు స్పష్టంగా కనిపిస్తుంది. మరి ఈ సీరియల్ పరిస్థితి ఏమి అవుతుందో వేచి చూడాలి.