Valentine Day 2024:వేలంటైన్స్ డే ఎందుకు జరుపుకుంటారు?
valentine Day 2024:’వేలంటైన్స్ డే’ను యువతీ యువకులు ప్రేమికుల దినోత్సవంగా జరుపుకోవడం చూస్తున్నాం. నేడు జరుపుకుంటున్న వేలంటైన్స్ డే ఎప్పడు మొదలైంది, ఎందుకు, అన్నదానికి కచ్చితమైన సమాచారం మాత్రం లేదు. దీని వెనుక పలు కథలున్నాయి.
మూడో దశాబ్దంలో ఇటలీలోని రోమ్ సామ్రాజ్యంలో ‘వేలంటైన్’ పేరుతో ఒక క్రైస్తవ సన్యాసి ఉండేవారు. అప్పటి చక్రవర్తి క్లాడియస్2.. వివాహితులతో పోలిస్తే అవివాహితులు సైనికులుగా బాగా పనిచేస్తారని భావించారు.
దాంతో యువకులు పెళ్లిళ్లు చేసుకోరాదనే ఆంక్షలు విధించారు. వేలంటైన్ కు ఇది అన్యాయంగా తోచింది. రహస్యంగా యువకులకు పెళ్లిళ్లు చేయించడం మొదలెట్టాడు. క్లాడియస్ కు ఇది తెలిసింది. దాంతో తన ఆదేశాలను ధిక్కరించినందుకు వేలంటైన్ కు మరణశిక్ష అమలు చేయించారు.
మరోకథనం ప్రకారం.. వేలంటైన్ అనే అతను జైలు నిర్బంధంలో ఉంటాడు. ఒక రోజు జైలర్ కుమార్తెను చూసి మనసు పారేసుకుంటాడు. తనకు ఉరిశిక్ష అమలు చేసే ముందు ఆమెకు ఓ లేఖ రాసి.. అందులో ‘నీ వేలంటైన్’ అని ముగిస్తాడు. ఇలా మరికొన్ని కథలు కూడా ప్రచారంలో ఉన్నాయి. వేలంటైన్ మరణానికి గుర్తుగానే వేలంటైన్స్ డే జరుపుకుంటున్నారని సమాచారం.