Chandramukhi :“చంద్రముఖి”లో నటించిన ఈ పాప ఇప్పుడు ఏమి చేస్తుందో తెలుసా…?
Chandramukhi Child Artist:రజనీకాంత్, నయనతార, జ్యోతిక ప్రధాన పాత్రలలో 2005లో వచ్చిన చంద్రముఖి సినిమా ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సినిమా టీవీలలో టెలికాస్ట్ అవుతుందంటే ఇప్పటికి అందరూ టీవీల వద్దే కూర్చుంటారు.
ఈ సినిమాలో అత్తిందొం పాటలో నటించిన చిన్నారి గుర్తు ఉందా.. ముద్దుగా బొద్దుగా రజనీకాంత్ తో కలిసి నటించిన ఆ పాప పేరు ప్రహర్షిత శ్రీనివాస్. ఈ సినిమా తర్వాత బాలనటిగా తమిళంలో ఎన్నో సినిమాలు, సీరియల్స్ చేసింది. ఆ తర్వాత చాలా కాలం నటనకు దూరం అయింది.
ఆమెకు 2021లోనే వివాహం జరిగింది.2022లో ఓ పాపకు జన్మనిచ్చింది. పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉన్న ప్రహర్షిత సోషల్ మీడియాలో మాత్రం చాలా చురుకుగా ఉంటుంది. ఇప్పుడు బుల్లితెరపై ఓ సీరియల్లో నటిస్తుంది.