Healthhealth tips in telugu

అల్యూమినియం ఫాయిల్స్ లో చుట్టిన ఆహారం తింటే ఏమవుతుందో తెలుసా?

food wrapping aluminium foil in telugu :బేక‌రీ ఉత్ప‌త్తులు, చికెన్ క‌బాబ్స్‌, లెగ్ పీస్‌లు, తందూరీ రోటీ వంటి ఆహార ప‌దార్థాలంటే ఇష్టం లేని వారు ఎవరు ఉండరు. అయితే ఆ ఆహారపదార్ధాలను చుట్టి ఒక వెండి కాగితం ఉండటం చూసారా? దాన్నే అల్యూమినియం ఫాయిల్ అని అంటారు.
అల్యూమినియం లోహాన్ని కొన్ని ప్ర‌త్యేక ప‌ద్ధ‌తుల్లో ప్రాసెసింగ్ చేయ‌డం ద్వారా ఆ ఫాయిల్‌ను త‌యారు చేస్తారు.

ఈ మ‌ధ్య కాలంలో ఎక్క‌డ చూసినా ఈ ఫాయిల్ వాడ‌కం ఎక్కువైపోయింది కూడా. ఆ అల్యూమినియం ఫాయిల్ చుట్ట‌బ‌డి ఉన్న ఆహారాన్ని తింటే మ‌న ఆరోగ్యానికి చాలా ప్ర‌మాదం కలుగుతుంది. యునైటెడ్ అర‌బ్ ఎమిరేట్స్‌, ఈజిప్ట్ దేశాల‌కు చెందిన కొంత మంది సైంటిస్టులు అల్యూమినియం ఫాయిల్ చుట్ట‌బ‌డి ఉన్న కొన్ని ఆహార ప‌దార్థాల‌పై ల్యాబొరేట‌రీలో చాలా ప్ర‌యోగాలు చేశారు.

ఆ ప్రయోగంలో అల్యూమినియం ఫాయిల్‌ను ఆహార ప‌దార్థాల‌కు చుట్ట‌డం వ‌ల్ల దానిలో నుంచి కొన్ని అల్యూమినియం అణువులు స్వ‌ల్ప మోతాదులో ఆహారంలో క‌లుస్తున్నాయ‌ట‌. దీంతో ఆ ఆహారాన్ని తిన్న మ‌న‌కు వివిధ ర‌కాల అనారోగ్యాలు వ‌స్తున్నాయ‌ట‌. ప్ర‌ధానంగా అల్జీమ‌ర్స్‌, ఎముక‌ల సంబంధ వ్యాధులు, మూత్ర‌శాయ అనారోగ్యాలు, మెద‌డు క‌ణాల ప‌నితీరు దెబ్బ‌తిన‌డం వంటి వ్యాధులు వ‌స్తున్నాయ‌ట‌.

అల్యూమినియం ఫాయిల్స్‌పై ఆ సైంటిస్టులు చేసిన ప్రయోగానికి సంబంధించిన రుజువుల‌ను ఇంట‌ర్నేష‌న‌ల్ జ‌ర్న‌ల్ ఆఫ్ ఎల‌క్ట్రోకెమిక‌ల్ సైన్స్‌లో కూడా ప్ర‌చురించార‌ట‌.అల్యూమినియం ఫాయిల్స్‌ను ఎక్కువ‌గా వాడితే పైన చెప్పిన వ్యాధులు దీర్ఘ‌కాలంలో వ‌స్తాయ‌ట‌.

ఈ క్ర‌మంలో అల్యూమినియం ఫాయిల్స్ చుట్టిన ఆహారాన్ని తిన‌క‌పోవ‌డ‌మే ఉత్త‌మ‌మ‌ని వైద్యులు కూడా చెబుతున్నారు. అల్యూమినియం ఫాయిల్స్‌కు బ‌దులుగా పింగాణీ, సెరామిక్ వంటి వ‌స్తువులలో ఆహారాన్ని పెట్ట‌వ‌చ్చ‌ని, వాటితో ఎలాంటి ప్ర‌మాదం లేద‌ని సైంటిస్టులు చెబుతున్నారు. కాబ‌ట్టి అల్యూమినియం ఫాయిల్స్ ప‌ట్ల జాగ్ర‌త్త‌గా ఉండ‌డం మ‌రిచిపోకండి.

ఈ మ‌ధ్య కాలంలో ఇలాంటి వార్త‌లు ఎక్కువ‌గా తెలుస్తున్న క్ర‌మంలో మ‌నం మ‌న ఆరోగ్యం ప‌ట్ల క‌చ్చితంగా జాగ్ర‌త్త‌లు తీసుకోవాల్సిందే. మొన్నా న‌డుమ మ్యాగీ నూడుల్స్‌, నిన్న బ్రెడ్‌, ఇప్పుడు అల్యూమినియం ఫాయిల్… ఇంకా ఇలాంటివి ఎన్ని తెలుసుకోవాల్సి వ‌స్తుందో క‌దా!

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.