Karivepaku Nilva pacchadi:ఆంధ్రా స్టైల్ కరివేపాకు నిల్వ పచ్చడి.. నోటికి భలే రుచిగా ఉంటుంది
Karivepaku Nilva pacchadi Recipe: కంటికి మేలు చేసే కరివేపాకు తాలింపు లోకే సరిపెడతారు.అది కూడ తినేటప్పుడు తీసి పక్కన పెట్టేస్తారు. అలా కాకుండా పక్కన పెట్టే చాన్స్ లేకుండా కరివేపాకుతో పచ్చడి చేసేయండి.
కావాల్సిన పధార్ధాలు
కరివేపాకు- 50 గ్రాములు
చింతపండు – 80-100 గ్రాములు
పచ్చిమిర్చి- 100 గ్రాములు
ఉప్పు – 2 టేబుల్ స్పూన్స్
నూనె- ¼ కప్పు
ఆవాలు – 1 టీస్పూన్
మెంతులు -1/4 టీ స్పూన్
జీలకర్ర – 1 టీస్పూన్
మినపపప్పు- 1 టేబుల్ స్పూన్
శెనగ పప్పు- 1 టేబుల్ స్పూన్
ధనియాలు- 2 టీస్పూన్
వెల్లుల్లి- 10
పసుపు- ½ టీ స్పూన్
తయారి విధానం
1.స్టవ్ పై కడాయి పెట్టి నూనె వేడి చేసి అందులో ఆవాలు,మెంతులు వేసి దోరగా వేపుకోవాలి.
2.తర్వాత అందులోకి శెనగపప్పు,మినపపప్పు వేసి రంగు మారే వరకు వేపుకోవాలి.
3.ఇప్పుడు అందులోకి వెల్లుల్లి ,జీలకర్ర పచ్చిమిర్చి వేసి మగ్గనివ్వాలి.
4.మగ్గిన పచ్చిమిర్చిలో తడిలేకుండా ఆరబెట్టుకున్న కరివేపాకు రెబ్బలు వేసి తడి పోయే వరకు వేపుకోవాలి.
5.వేగిన పధార్ధాలను మిక్సి జార్ లో వేసుకోని కాస్త బరకగా గ్రైండ్ చేసుకోవాలి.
6.ఇప్పుడు అదే కడాయిలో చిక్కని చింతపండు గుజ్జు బెల్లం వేసి చిక్కగా అయ్యే వరకు ఉడికించుకోవాలి.
7.చిక్కని చింతపండు పేస్ట్ లోకి ఉప్పు పసుపు వేసి గ్రైండ్ చేసుకున్న కరివేపాకు పచ్చడి లో వేసి బాగా కలిపి చల్లారనివ్వాలి.
8.అంతే కమ్మటి కరివేపాకు రెడి అయినట్టే.
Click Here To Follow Chaipakodi On Google News