Face Glow Tips:రాత్రి సమయంలో రాస్తే చాలు ఎంతటి నల్లటి ముఖం అయినా తెల్లగా మెరిసిపోతుంది
Rice flour and curd Face Glow Tips In telugu : ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు ముఖం అందంగా ఉండాలని కోరుకుంటున్నారు. అలా కోరుకోవటం కూడా సహజమే. దాని కోసం బ్యూటీ పార్లర్ ల చుట్టూ తిరిగి వేల కొద్ది డబ్బును ఖర్చు పెట్టేస్తూ ఉన్నారు. అలా కాకుండా ఇంటి చిట్కాలను ఉపయోగించి తెల్లని కాంతివంతమైన ముఖాన్ని సొంతం చేసుకోవచ్చు. కాస్త శ్రద్ద పెడితే సరిపోతుంది.
ఒక బౌల్ లో ఒక స్పూన్ బియ్యంపిండి, పావు స్పూన్ పసుపు, 2 స్పూన్ల పెరుగు, విటమిన్ E ఆయిల్ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి పావుగంట అయ్యాక చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా వారంలో2 సార్లు చేయాలి.
ఈ ప్యాక్ ముఖానికి వేయటం వలన చర్మానికి తగినంత తేమ అందుతుంది. అలాగే చర్మం మీద మృత కణాలు తొలగిపోయి ముఖం కాంతివంతంగా మెరుస్తుంది. బియ్యంపిండి మృతకణాలను తొలగించటానికి, పసుపు, పెరుగు లో ఉన్న పోషకాలు చర్మానికి పోషణ అందించటమే కాకుండా చర్మ ఛాయ మెరుగుపడటానికి సహాయపడతాయి.
ఇలా ఇంటిలో దొరికే సహజసిద్దమైన పదార్ధాలతో ముఖాన్ని ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా నల్లని మచ్చలు లేకుండా తెల్లగా కాంతివంతంగా మెరిసేలా చేసుకోవచ్చు. ఈ చిట్కా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.