Street Style Bhel Puri:కేవలం 5 నిమిషాల్లో భేల్ పూరి.. ఇలా ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు
Bhel Puri Recipe: హైదరాబాద్ లో సరదాగా సాయంత్రం అలా బయటకు వెల్తే అన్ని పార్క్ ల దగ్గర మనకు కనిపించే టైంపాస్ స్నాక్స్ భేల్ పూరి.స్ట్రీట్ స్టైల్ భేల్ పూరి ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం.
కావాల్సిన పదార్ధాలు
మరమరాలు – ¼ kg
ఉల్లిపాయలు – 2
టమాటోలు – 2
పల్లీలు – సరిపడా
పచ్చిమిర్చి – 2
కారం – 1 టీస్పూన్
ఉప్పు – రుచ్చిక సరిపడా
జీలకర్ర పొడి – ½ టీ స్పూన్
చాట్ మసాలా – ½ టీ స్పూన్
బూందీ – ½ కప్పు
కొత్తిమీర – కొద్దిగా
తయారీ విధానం
1.ముందుగా సరిపడా గిన్నెలో మరమరాలను వేసుకోవాలి.
2.అందులోకి సన్నగా తరిగిన ఉల్లిపాయలు,టమాటో ముక్కలు,పచ్చిమర్చి తరుగు,పల్లీలు వేసుకోవాలి.
3.తర్వాత జీలకర్ర పొడి ,చాట్ మసాల పొడి తీసిపెట్టుకున్న బూందీ మిశ్రమం వేసి కొత్తిమీర తరుగు వేసుకోవాలి.
4.అన్ని వేసిన భేల్ పూరి మిశ్రమాన్ని గిన్నెలోనే బాగా టాస్ చేసుకోని సర్వ్ చేసుకోవాలి.