Kitchen Tips:మహిళల కోసం ప్రత్యేక వంటింటి చిట్కాలు
Kitchen Tips in telugu:వంటింటిలో కొన్ని చిట్కాలను పాటిస్తే సమయం ఆదా అవ్వటమే కాకుండా వంటలో పోషకాలు అన్ని అలానే ఉండి మన ఆరోగ్యానికి కూడా చాలా బాగా సహాయపడతాయి. వాటి గురించి తెలుసుకుందాం.
బియ్యంలో మట్టిగడ్డలు ఎక్కువగా వుంటే చారెడు ఉప్పు వేసి పది నిమిషాలు నానబెడితే మట్టి గడ్డలు నీళ్ళలో కరిగి పోతాయి.
కాయగూరల్ని ముందుగా నీటిలో శుభ్రంగా కడిగి ఆ తరువాత ముక్కలుగా కట్ చేయాలి. కట్ చేసిన తర్వాత కడిగితే పోషకాలు పోతాయి.
కూరగాయ ముక్కల్ని పసుపు కలిపిన నీటిలో వుంచితే ఏమైనా క్రిములు వుంటే అవి పైకి తేలిపోతాయి.
నిమ్మకాయల్ని నేలమీద పెట్టి అరచేత్తో అదిమి అటు ఇటు త్రిప్పి ఆతర్వాత కోస్తే రసం కొంచెం ఎక్కువగా వస్తుంది. ఫ్రిజ్ లోంచి తీసిన నిమ్మకాయ గది ఉష్ణోగ్రతకి చేరిన తర్వాతనే కోయాలి. లేకుంటే రసం తక్కువగా వస్తుంది.
పగిలిన గ్రుడ్డును కొంచెం వెనగర్ కలిపిన నీళ్ళలో ఉడకబెడితే లోపలి ద్రవం బయటికి రాకుండా బాగా ఉడుకుతుంది. గ్రుడ్లను ఉప్పు నీటిలో ఉడక బెట్టి వెంటనే చన్నీళ్ళలో ఉంచితే పై పెంకు ఒలవడం తేలికవుతుంది. కోడిగ్రుడ్డును అల్యూమినియం లేదా వెండి పాత్రలలో పగులగొడితే అందులోని సల్ఫర్ కారణంగా పాత్రలు నల్లబడతాయి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.