Lemon seeds:ఈ విషయం తెలిస్తే నిమ్మకాయ గింజలను అసలు పాడేయరు…ఇది నిజం
Lemon Seeds benefits in telugu : నిమ్మకాయ రసం తీసుకొని నిమ్మ గింజలను పాడేస్తూ ఉంటాం. నిమ్మ గింజలలో ఉన్న ప్రయోజనాలు తెలిస్తే అసలు పాడేయకుండా తినటం అలవాటు చేసుకుంటారు. నిమ్మకాయ గింజలు కొంచెం చేదుగా ఉంటాయి. నిమ్మకాయ గింజలలో సాలిసిలిక్ యాసిడ్ సమృద్దిగా ఉండుట వలన నొప్పులను తగ్గించటంలో చాలా సమర్ధవంతంగా పనిచేస్తాయి.
శరీరం నుండి విషాలను తొలగిస్తుంది. సాదరణంగా పిల్లల్లో నులిపురుగుల సమస్య వస్తూ ఉంటుంది. అలాంటప్పుడు నిమ్మ గింజలను మెత్తగా చేసి పాలల్లో ఉడికించి తాగితే ఆ సమస్య నుండి బయట పడతారు. నిమ్మ గింజలలోని యాంటీ ఫంగల్ లక్షణాలు ఉండుట వలన ఇన్ఫెక్షన్తో సమర్ధవంతంగా పోరాటం చేస్తాయి.
నిమ్మ గింజలలో శక్తివంతమైన యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉండుట వలన యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లతో కూడా పోరాడుతుంది. శరీరంలో రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. నిమ్మ విత్తనాలను ఎండబెట్టి పొడిగా చేసి వాడుకోవచ్చు. ఈ పొడిలో నీటిని కలిపి చర్మ సమస్యలు ఉన్న ప్రదేశంలో రాస్తే తొందరగా తగ్గుతాయి.
గోళ్లు మరియు కాలి చుట్టూ ఫంగల్ ఇన్ఫెక్షన్లకు కారణమయ్యే ఫంగస్ ఇన్ ఫెక్షన్ తో పోరాటం చేస్తుంది. నిమ్మకాయ గింజలను ఎక్కువగా వాడితే జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వీటిని వాడే ముందు ఆయుర్వేద వైధ్య నిపుణున్ని సంప్రదించాలి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.