Weight Loss:ఈ నూనెతో కలిపి గుడ్డుని తింటే బరువు తగ్గుతారట… నిజమేనా?
Weight Loss Egg :మనలో చాలా మంది గుడ్డు తినడానికి ఇష్టపడతారు. కొంతమంది గుడ్డుసొన పాలల్లో కలుపుకొని తాగుతారు. కొంతమంది ఉడికించుకొని తింటారు. కొంత మంది రకరకాల వంటకాలను చేసుకుని తింటారు. కొంతమంది గుడ్డు అంటే ఇష్టపడరు.
అయితే ప్రతిరోజు గుడ్డు తింటే మన శరీరానికి అవసరమైన ఎన్నో పోషకాలు అందుతాయి. గుడ్డు తినడం వలన శరీరంలో జీవ క్రియ రేటు పెరుగుతుంది.మధుమేహం ఉన్న వారికి కూడా గుడ్ చాలా హెల్ప్ చేస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది.
బరువు తగ్గించడంలో కూడా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.గుడ్డు తిన్నప్పుడు కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉండి తొందరగా ఆకలి వేయదు. గుడ్డులో కాల్షియం సమృద్ధిగా ఉండటం వలన ఎముకలు బలంగా ఆరోగ్యంగా ఉంటాయి. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంలో గుడ్డు కీలకమైన పాత్రను పోషిస్తుంది.
గుడ్డును వండినప్పుడు రకరకాల నూనెలు వాడుతూ ఉంటాం అయితే ఏ నూనె వాడితే మంచిదో తెలుసుకుందాం. గుడ్డును వండినపుడు కొబ్బరి నూనెను ఉపయోగిస్తే అధికంగా ఉన్న కొవ్వు కరుగుతుంది. అంతేకాకుండా చెడు కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు కోడిగుడ్డుతో వంటకాలు చేసుకున్నప్పుడు కొబ్బరినూనెను వాడటం మంచిది. అదే సోయాబీన్ నూనె వాడితే బరువు పెరిగే అవకాశం ఉంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.