Kitchenvantalu

Soft Roti:చపాతీ లేదా రోటీలు దూదిలా మెత్తగా, రుచిగా రావాలా..ఈ టిప్స్ ఫాలో అవ్వండి

Roti Making Tips in telugu:సాధారణంగా బరువు తగ్గటానికి ఈ మధ్యకాలంలో మనలో చాలా మంది రోటీలను తయారు చేసుకొని తింటున్నారు. రోటీలు సమయం గడిచే కొద్ది గట్టిగా మారిపోతూ ఉంటాయి. అలా కాకుండా ఎంతసేపైనా మెత్తగా ఉండేలా రోటీలను చేసుకోవాలంటే ఇప్పుడు చెప్పే చిట్కాలను ఫాలో అవ్వాలి. రోటీలు వేడివేడిగా తింటేనే మెత్తగా ఉంటాయి. అయితే ఇప్పుడు చెప్పే చిట్కాలను ఫాలో అయితే రోటీ లేదా చపాతి చాలా మృదువుగా మెత్తగా ఉంటాయి.

రోటీ తయారు చేయడానికి మనం గోధుమ పిండిని మార్కెట్లో కొంటూ ఉంటాం. అలా కాకుండా మనం గోధుమలను మిల్లుకు తీసుకువెళ్లి మెత్తని పిండిగా తయారు చేసుకుంటే మంచిది. ఈ విధంగా మనం పిండిని మర పట్టించడం వలన ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది. ఫైబర్ సమృద్ధిగా ఉండటం వలన రోటీని మృదువుగా చేస్తుంది. అంతేకాకుండా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.

పిండిని కలుపుతున్నప్పుడు చిటికెడు ఉప్పు కలపాలి. అలాగే కొంచెం నూనెను కూడా వేసి గోరువెచ్చ నీటితో పిండిని కలపాలి. ఈ విధంగా చేయడం వలన రోటీ మృదువుగా మారుతుంది. పిండి కలిపిన తర్వాత 15 నిమిషాల పాటు మూత పెట్టి పక్కన ఉంచాలి. ఇలా చేయటం వల్ల కూడా రోటీ లేదా చపాతి మృదువుగా వస్తుంది. రోటీలను పలుచగా చేసుకుంటే బాగుంటుంది.

రోటీలను పాన్‌లో తలక్రిందులుగా చేసి తేలికగా కాల్చండి. ఆ తర్వాత నేరుగా గ్యాస్ మంట మీద కాల్చాలి. లేదంటే బేకింగ్ ట్రేని కూడా ఉపయోగించవచ్చు. ఇప్పుడు చెప్పిన చిట్కాలు పాటిస్తే మెత్తని రోటీలు తినవచ్చు. సమయం ఎంతసేపైనా రోటీలు గట్టి పడకుండా మెత్తగా ఉంటాయి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.