Mullangi Chutney: ముల్లంగి పచ్చడిని ఇలా చేస్తే నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది
Mullangi Chutney Recipe: చారు,సాంబార్, అంటే తప్ప, చాలా మందికి ముల్లంగి గుర్తుకురాదు. అరకొరగా, వాడే ముల్లంగి, ఆరోగ్యానికి, మాత్రం, ఎంతో మేలు చేస్తుంది. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నా, ముల్లంగి తో, పచ్చడి చేద్దాం.
కావాల్సిన పదార్ధాలు
ముల్లంగి – 400 గ్రాములు
అల్లం – 1 ఇంచ్
ఉల్లిపాయ – 1
పసుపు – ½ టీస్పూన్
నూనె – 1/2కప్పు
ధనియాలు – 1/2కప్పు
ఎండుమిర్చి – 25 నుంచి 30
జీలకర్ర – 1 టీ స్పూన్
ఉప్పు –తగినంత
తాళింపు కోసం..
నూనె – 2 టేబుల్ స్పూన్స్
ఆవాలు – 1 టీ స్పూన్
జీలకర్ర – 1 టీ స్పూన్
కరివేపాకు – 2 రెబ్బలు
తయారీ విధానం
1.ముల్లంగి తొక్క తీసుకుని, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
2. స్టవ్ పై కడాయి పెట్టుకుని, 1/3కప్పు నూనె వేసి, ముల్లంగి ముక్కలు వేసుకుని, మంచి రంగు వచ్చేదాకా వేపుకోవాలి.
3. 15 నిముషాల తర్వాత, ఉల్లిపాయలు, అల్లం, పసుపు, వేసి మరో రెండు మూడు నిముషాలు వేపుకోవాలి.
4. ఉల్లిపాయలు కాస్త మగ్గిన తర్వాత, చింతపండు వేసి, మెత్త పడే వరకు, వేపుకుని, పక్కనపెట్టుకోవాలి.
5.ఇప్పుడు అదే కడాయిలో, మిగిలిన నూనెను వేసుకుని, ఎండుమిర్చి వేసి, మిరపకాయలు కాస్త పొంగనివ్వాలి.
6. పొంగిన మిరపకాయల్లో, ధనియాలు, జీలకర్ర, కొద్దిగా పసుపు వేసి, వాసన వచ్చేదాకా వేపుకోవాలి.
7. ఇప్పుడు మిక్సీ జార్ లో ధనియాలు, ఎండుమిర్చి వేసి, బరకగా గ్రైండ్ చేసుకోవాలి.
8. అందులోకి ముల్లంగి ముక్కలు, ఉప్పు వేసి, మళ్లీ మిక్సీ తిప్పుకోవాలి.
9. తాళింపు కోసం స్టవ్ పై పాన్ పెట్టుకుని, నూనె వేసి, ఆవాలు , జీలకర్ర, కరివేపాకు, వేసి, వేగిన తాలింపును పచ్చడిలో కలుపుకోవాలి.
10. అంతే ముల్లంగి పచ్చడి రెడీ.
Click Here To Follow Chaipakodi On Google News