weight Loss:కేవలం 1 గ్లాస్ చాలు 10 రోజుల్లో స్పీడ్ గా బరువు తగ్గి సన్నగా అవ్వాలంటే ఎవరు చెప్పని టెక్నిక్
Ginger and cumin seeds Weight Loss Tips In telugu : మనలో చాలా మంది అధిక బరువు సమస్య రాగానే చాలా కంగారు పడిపోతు ఉంటారు. మార్కెట్ లో దొరికే రకరకాల పొడక్ట్స్ వైపు అడుగులు వేస్తారు. అలా కాకుండా మన ఇంటిలో దొరికే సహజసిద్దమైన పదార్ధాలతో చాలా సులభంగా బరువును తగ్గించుకోవచ్చు.
ఈ ఇంటి చిట్కా కోసం 2 ఇంగ్రిడియన్స్ ఉపయోగిస్తున్నాం. అవి జీలకర్ర, అల్లం. ఈ రెండింటినీ మనం ప్రతి రోజు వంటింటిలో వాడుతూనే ఉంటాం. జీలకర్ర, అల్లం రెండింటిలోను ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అల్లం, జీలకర్ర బరువు తగ్గించటానికి చాలా బాగా సహాయపడతాయి.
పొయ్యి మీద గిన్నె పెట్టి ఒక గ్లాస్ నీటిని పోసి ఒక స్పూన్ జీలకర్ర, అంగుళం అల్లం ముక్కను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసి 5 నుంచి 7 నిమిషాల వరకు మరిగించాలి. మరిగిన ఈ నీటిని గ్లాస్ లోకి వడకట్టి ఉదయం,సాయంత్రం తాగాలి. ఈ విధంగా ప్రతి రోజు చేస్తూ ఉంటే మంచి ప్రయోజనం కలుగుతుంది.
ఈ డ్రింక్ తీసుకోవటం వలన తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అయ్యి కొవ్వుగా మారకుండా చేస్తుంది. అలాగే బరువు తగ్గినప్పుడు ఎముకలు బలహీనంగా మారకుండా చేస్తుంది. అందువల్ల ఈ డ్రింక్ తాగి అధిక బరువు సమస్య నుండి బయట పడండి.