Kitchenvantalu

Kitchen Hacks: వంట చేసే ప్రతి ఒక్కరికి ఎంతగానో ఉపయోగపడే వంటింటి చిట్కాలు

Kitchen Hacks: వంటింటిలో కొన్ని చిట్కాలను పాటిస్తే సమయం ఆదా అవ్వటమే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అటువంటి చిట్కాలను ఇప్పుడు తెలుసుకుందాం.

నిమ్మకాయలు ఎక్కువగా ఉన్నప్పుడు రసం తీసి నిల్వ చేస్తూ ఉంటాం. నిమ్మరసం ఎక్కువగా రావాలంటే పది నిముషాల పాటు గోరువెచ్చటి నీటిలో వేసి ఉంచాలి.

నూనెలోకాని, నెయ్యిలో కాని కొంచెం బెల్లం ముక్కని వేస్తే దానిని గడ్డ కట్టకుండా ఆవుతుంది. నెయ్యి మరిగించే సమయంలో రెండు చిటికెలు ఉప్పు దానిలో వేశారంటే నెయ్యి ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉంటుంది.

పచ్చిమిరపకాయలు పండు రంగు రాకుండా ఉండాలంటే గాలి చొరబడని గట్టి మూతగల సీసాలో ఉంచి, చిటికెడు పసుపు చల్లి ఎండతగిలేలా ఉంచాలి.

పప్పుధాన్యాలు పురుగు పట్టి చెడిపోకుండా నిల్వ ఉండాలంటే పప్పుల్లో నాలుగు ఇంగువ పలుకులు వేసి ఉంచితే చాలు! పప్పులకు పురుగుపట్టదు. ఎంతకాలమైనా నిల్వ ఉంటాయి.

పాత చేతి రుమాళ్ళు రెండింటిని తీసుకొని మూడు పక్కల కలిపి కుట్టి ఒక పక్క వదిలేయాలి. సంచిలా తయారైన దీనిని తడిపి అందులో ఆకు కూరలు పెట్టి ఫ్రిజ్‌లో ఉంచితే వాడిపోకుండా తాజాగా వుంటాయి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.
Click Here To Follow Chaipakodi On Google News