Instant Rava Idli:కేవలం 15 నిమిషాల్లో హోటల్ స్టైల్ రవ్వ ఇడ్లీ..మెత్తగా మృదువుగా..
Instant Rava Idli Recipe:కేవలం 15 నిమిషాల్లో హోటల్ స్టైల్ లో రవ్వ ఇడ్లీ ఎలా తయారుచేసుకోవాలో చూద్దాం. చాలా సులభంగా చేసుకోవచ్చు. దీనికి కావలసిన పదార్ధాలు,తయారి విధానం తెలుసుకుందాం.
కావలసిన పదార్ధాలు
2 టేబుల్ స్పూన్లు నెయ్యి
10 జీడిపప్పు
1 స్పూన్ ఆవాలు
½ స్పూన్ మినపప్పు
½ టీస్పూన్ శనగ పప్పు
½ స్పూన్ జీలకర్ర
కరివేపాకు
చిటికెడు ఇంగువ
2 మిరపకాయలు (సన్నని ముక్కలు)
1 అంగుళం అల్లం(తురమాలి )
1 కప్పు రవ్వ
1 కప్పు పెరుగు
½ స్పూన్ ఉప్పు
½ కప్పు నీరు
2 టేబుల్ స్పూన్లు తరిగినకొత్తిమీర
½ టీస్పూన్ ENO
తయారి విధానం
ముందుగా పాన్‌లో 2 టేబుల్‌స్పూన్ల నెయ్యి వేసి 10 జీడిపప్పులను వేగించి పక్కన పెట్టాలి. అదే నెయ్యిలో, 1 tsp ఆవాలు, ½ tsp మినపప్పు, ½ tsp శనగ పప్పు, ½ tsp జీలకర్ర, కరివేపాకు మరియు చిటికెడు ఇంగువ వేసి కలపాలి. ఆ తర్వాత పచ్చి మిరప ముక్కలు,అల్లం తురుము వేసి కలపాలి.
ఆ తర్వాత 1 కప్పు రవ్వ వేసి మంచి వాసన వచ్చే వరకు వేగించాలి. ఈ మిశ్రమం చల్లారిన తర్వాత 1 కప్పు పెరుగు మరియు ½ tsp ఉప్పు వేసి బాగా కలపాలి. అరకప్పు నీటిని పోసి కలపాలి. ఆ తర్వాత కొత్తిమీర వేసి బాగా కలిపి పక్కన పెట్టాలి. రవ్వ బాగా నానిన తర్వాత ENO వేసి పిండి నురుగు వచ్చే వరకు బాగా కలపాలి.
ఇప్పుడు వేయించిన జీడిపప్పును నెయ్యి రాసిన ఇడ్లీ ప్లేట్‌లో వేసి, పిండిని ఇడ్లీ మౌల్డ్‌లో పోయాలి. ఇడ్లీ ప్లేట్‌ను స్టీమర్‌లో ఉంచి 15 నిమిషాలు ఆవిరి మీద ఉడికించాలి. చివరగా చట్నీతో రవ్వ ఇడ్లీతో సర్వ్ చేయండి.