Cooking Tips:ఈ టిప్స్ ఫాలో అయితే.. వంట టేస్టీగా, త్వరగా అవుతుంది
Useful Cooking Tips: బెండకాయ వేయిస్తున్నప్పుడు బాగా జిగురుగా ఉంటుంది. కడాయిలో ముక్కలు వేయగానే కొంచెం మజ్జిగ కూడా వేసి కలిపితే జిగురు రాదు. బెండ కాయలు కడిగిన తర్వాత ఆరబెట్టి కోస్తే తీగలు సాగకుండా ఉంటాయి. రెండు చుక్కల నిమ్మరసం, కొంచెం పెరుగు వేస్తే బెండకాయ కూరలో జిగురుపోతుంది.
బాగా చల్లారిన పాలు తోడుకోవాలంటే మజ్జిగ చుక్కలతో పాటు చిన్న ఎండుమిర్చి వేస్తే సరి.
నిమ్మకాయ కోసే ముందు బలంగా చేతులతో నలిపి ఆ తర్వాత కోసి పిండితే రసం సులువుగా వస్తుంది.
వంకాయ కూరలో ఒక స్పూను పాలు వేసి ఉడికిస్తే ముక్కలు నల్లబడవు.
కత్తిపీటకు ఉప్పు రాయడం వల్ల పదునుగా తయారవుతుంది.
బట్టలపై నిమ్మరసంగానీ, టూత్‌పేస్ట్‌గానీ వేసి రుద్దడం వల్ల ఇంకు మరకలు పోతాయి.
ఎండు కొబ్బరి చిప్ప కందిపప్పు డబ్బాలో వేసి నిల్వ ఉంచితే పప్పు పాడవదు.
కాకరకాయ ముక్కలకు కొంచెం ఉప్పురాసి, నీళ్లు చల్లి గంట సేపు ఉంచితే చేదు పోతుంది.
చేతులకు నూనెరాసి పనసకాయ తరిగితే జిగురు అంటకుండా ఉంటుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
Click Here To Follow Chaipakodi On Google News