Kitchenvantalu

Badam Halwa:మళ్లీ మళ్లీ తినాలనిపించే బాదం హల్వా ఈ టిప్స్ తో సూపర్ గా ..

Badam Halwa Recipe: తీపి తినాలి అనుకునేవారు, చిటికెలో తయారు చేసే, మిఠాయి హల్వానే. కమ్మగా, నాలికపై కరిగిపోయే, బాదం హల్వా తయారు చేసేద్దాం.

కావాల్సిన పదార్ధాలు
బాదం పప్పు – 1 కప్పు
పాలు – 350ML
చక్కెర – 1/2కప్పు
నెయ్యి – ¾ కప్పు
బొంబాయి రవ్వ – 1 టేబుల్ స్పూన్
బాదం పలుకులు – 2 టేబుల్ స్పూన్స్
కుంకుమపువ్వు – 3 టెబుల్ స్పూన్స్

తయారీ విధానం
1.మరిగే నీళ్లలో బాదం వేసి, 8 నిముషాలు ఉడికించి, చల్లని నీళ్లలో వేసి, 5 నిముషాలు పాటు వదిలేయాలి.
2.5 నిముషాల తర్వాత బాదం పొట్టు ఈజీగా వదిలిపోతుంది.
3.ఇప్పుడు ఒక మిక్సీజార్లోకి పొట్టు తీసుకున్న బాదం, 100 ml పాలు, మెత్తనిపేస్ట్ చేసుకోవాలి.
4. ఇప్పుడు స్టవ్ పై అడుగు మందంగా ఉండే మూకుడు పెట్టి, నెయ్యి కరిగించి,అందులో బొంబాయి రవ్వ వేసి వేవుకోవాలి.
5. వేగిన రవ్వలో, బాదం పేస్ట్, మిగిలిన 250 పాలు, వేసుకుని, మీడియం ఫ్లేమ్ పై కలుపుతూ, ఉడకనివ్వాలి.

6. 15 నిముషాల తర్వాత బాదం పేస్ట్ వేగి, పచ్చి వాసన పోతుంది.
7. అప్పుడు, అందులోకి, పంచదార, కుంకుమపవ్వు పాలు, వేసి, కరిగేదాకా కలుపుతూ ఉడికించాలి.
8. చెక్కర కరిగిన తర్వాత మిగిలిన నెయ్యి, బాదం పలకులు వేసి, 5 నిముషాలకు ఒకసారి కలుపుతూ ఉండాలి.
9.40 నిముషాల పాటు మీడియం ఫ్లేమ్ పై కలుపుతూ ఉంటే, హల్వా నుంచి నెయ్యి తేలుతుంది.
10. ఆ టైమ్ లో స్టవ్ ఆఫ్ చేసుకుని సెర్వ్ చేసుకోవడమే.
Click Here To Follow Chaipakodi On Google News