Kitchenvantalu

House Cleaning Tips:ఇంటిని క్లీన్ చేసేటప్పుడు ఈ టిప్స్ పాటించండి..

House Cleaning Tips in telugu:సీలింగ్‌ ఫ్యాన్‌ శుభ్రం చేసే ముందు పాత దిండు కవర్‌ తీసుకుని ఫ్యాన్‌ రెక్కలకు తొడగాలి. తరువాత కర్రతో తుడవాలి. దుమ్ము కింద పడే అవకాశం ఉండదు.

ఐరన్‌ బాక్స్‌పై జిడ్డు పేరుకుపోయిందా? అయితే పిల్లో కవర్‌పై కొంచెం ‘ సాల్ట్‌ వేసి ఐరన్‌ చేయాలి. ఉప్పు ఐరన్‌బాక్స్‌కు ఉన్న జిడ్డును మొత్తం తొలగిస్తుంది.

టైల్స్‌ మధ్యలో ఉన్న (గౌట్‌ లైన్స్‌ మరకలు పోయి శుభ్రం కావాలంటే బేకింగ్‌సోడాలో బ్లీచ్‌ కలిపి పేస్ట్‌ మాదిరిగా చేసి గ్రౌట్‌ లైన్స్‌పై పూయాలి. పదినిమిషాల తరువాత తుడిచేయాలి.

డైనింగ్‌ టేబుల్‌పై మరకలు పోవాలంటే అరకప్పు వెనిగర్‌ తీసుకుని అందులో అరకప్పు ఆలివ్‌ ఆయిల్‌ వేసి ఆ మిశ్రమంతో తుడవాలి. టేబుల్‌పై ఉన్న ఎటువంటి మరకలైనా తొలగిపోతాయి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.
Click Here To Follow Chaipakodi On Google News