Pippi Pannu: ఇలా చేస్తే కేవలం 5 నిముషాల్లో మీ పిప్పి పన్నులో ఉండే పురుగులు మాయం!
Pippi pannu : దంతాల ఇన్ ఫెక్షన్ వచ్చిందంటే చాలా ఇబ్బందిగా ఉండటమే కాకుండా నోటి దుర్వాసన కూడా వస్తుంది. ఈ సమస్య నుండి బయట పడటానికి ఇంటి చిట్కాలు చాలా బాగా పనిచేస్తాయి. కాస్త ఓపికగా చేసుకోవాలి. సమస్య తీవ్రంగా ఉంటే డాక్టర్ సూచనలను పాటిస్తూ ఇప్పుడు చెప్పే ఇంటి చిట్కా ఫాలో అయితే చాలా తొందరగా ఉపశమనం కలుగుతుంది.
దీని కోసం ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో ఒక స్పూన్ తేనె,చిటికెడు దాల్చిన చెక్క పొడి వేసి బాగా కలిపి నోటిలో పోసుకొని పుక్కిలించి ఉమ్మి వేయాలి. ఉదయం సమయంలో 5 నుంచి 7 నిమిషాల పాటు ఈ విధంగా చేస్తే దంతాల దగ్గర ఇన్ ఫెక్షన్ తగ్గటమే కాకుండా నోటి దుర్వాసన పోయి ఫ్రెష్ గా ఉంటుంది. పిప్పి పన్ను సమస్య కూడా తగ్గుతుంది.
ఇలా నాలుగు రోజుల పాటు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. తేనె,దాల్చినచెక్కలో ఉండే లక్షణాలు యాంటీబ్యాక్టీరియల్ ఏజెంట్ గా పనిచేసి నోటిలో బ్యాక్టీరియాను నాశనం చేస్తాయి. అంతేకాక నోటిలో మంచి బ్యాక్టీరియా వృద్ది చెంది ఇన్ ఫెక్షన్ పూర్తిగా తగ్గిపోతుంది. దంతాల సమస్యలు వచ్చినప్పుడు అసలు అశ్రద్ద చేయకూడదు.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.