Kitchenvantalu

Betel Leaves Rice:త‌మ‌ల‌పాకుల‌తోనూ ఎంతో రుచిగా ఉండే రైస్ చేయ‌వ‌చ్చు.. లంచ్ బాక్స్ Recipe

Betel Leaves Rice Recipe: తమలపాకులు పాన్ లోకే కాదు, వంటిల్లో కూడా వాడుతారు. తమలపాకులో ఉండే ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో,కారంగా కమ్మగ, ఘుమఘుమలు వెదజల్లే తమలపాకు అన్నం ట్రై చేద్దాం.

కావాల్సిన పదార్ధాలు
తమలపాకుల తరుగు – 5

వండిన అన్నం – 1 కప్పు
ఉల్లిపాయ – 1 కప్పు
నూనె – 4 టేబుల్ స్పూన్స్
ఉప్పు – రుచికి సరిపడా
పసుపు – 1/2టీస్పూన్
ఆవాలు – 1 టీస్పూన్
జీలకర్ర – 1/2టీస్పూన్
అన్నం – 1.5 కప్పు

పొడి కోసం ..
మినపప్పు – 2 టేబుల్ స్పూన్స్
ఎండుమిర్చి – 5
వెల్లుల్లి – 10
నువ్వులు – 2 టేబుల్ స్పూన్స్

తయారీ విధానం –
1.ముందుగా స్టవ్ పై కడాయి పెట్టుకుని, వెల్లుల్లి, మినపప్పు, వేసి, దోరగా వేయించుకోవాలి.
2. పప్పు వేగాక ఎండుమిర్చి వేసి ఆపై నువ్వులు కూడా వేసుకుని, వేగిన తర్వాత మిక్సీ జార్ లో వేసుకుని పొడి చేసి పెట్టుకోవాలి.
3. ఇప్పుడు అదే బాండీలో నూనె వేడి చేసి, ఆవాలు, జీలకర్ర, చిటపటలాడనివ్వాలి.

4. అందులోకి ఉల్లిపాయ తరుగు ,ఉప్పు, పసుపు, వేసుకుని, ఉల్లిపాయలు బాగా వేగనివ్వాలి.
5. ఉల్లిపాయలు వేగిన తర్వాత తమలపాకు తరుగు వేసి, మూడు నిముషాలు ఫ్రై చేసుకోవాలి.
6. తర్వాత అందులోకి వండుకున్న అన్నం, గ్రైండ్ చేసుకున్న మినపప్పు పొడి వేసి, హై ఫ్లేమ్ పై టాస్ చేసి స్టవ్ ఆఫ్ చేయాలి.
7. అంతే ఘుముఘుమలాడే తమలపాకు అన్నం రెడీ అయినట్లే..
Click Here To Follow Chaipakodi On Google News