Paneer Matar Masala Pulao:రెస్టారెంట్ మాదిరి టేస్ట్‌తో పనీర్ మటర్ పులావ్.. ఇంట్లోనే సులభంగా చేయవచ్చు
Paneer Matar Masala Pulao Recipe: పన్నీర్ మటర్ మసాలా పలావ్ వెజిటేరియన్ ల పాలిట కల్పతరువు పన్నీర్, అత్యఅధిక ప్రొటీన్స్ తో, అమోఘమైన రుచితో, స్పైసీ అండ్ టేస్టీ, పన్నీర్ మటర్ మాసాల పలావ్ ఎలా తయారు చేయాలో చూసేయండి.
కావాల్సిన పదార్ధాలు
ఉల్లిపాయ పచ్చిమిర్చి ఊరపెట్టడానికి..
నిమ్మకాయ -1
పచ్చిమిర్చి -2
ఉల్లిపాయ -1
ఉప్పు – తగినంత
చక్కెర – 1/4టీస్పూన్
పలావ్ కోసం..
నెయ్యి – 1/2కప్పు
బిరియానీ ఆకు – 1
యాలకులు -4
లవంగాలు – 4
దాల్చిన చెక్క – 1 ఇంచ్
సాజీర – 1 టీ స్పూన్
జాపత్రి – కొంచం
మిరియాలు – 1/2టీ స్పూన్
పన్నీర్ – 200 గ్రాములు
ఉల్లిపాయలు – 2
అల్లం వెల్లుల్లి – 1 టీ స్పూన్
పసుపు 1/4టీ స్పూన్
జీలకర్ర పొడి – 1/2టీస్పూన్
ఉప్పు – తగినంత
టమాటా ముక్కలు – 1/2కప్పు
ఫ్రోజెన్ బఠాని – 1/2కప్పు
బాస్మతీ బియ్యం – 2 కప్పులు
నీళ్లు – 3 కప్పులు
పచ్చిమిర్చి -2
కొత్తిమీర – కొద్దిగా
తయారీ విధానం
1.ఉల్లిపాయ ఊరపెట్టడానికి తీసుకున్న పదార్ధాలు అన్ని తీసుకుని, ఒక గిన్నెలో కలిపి, గంట సేపు ఊరపెట్టాలి.
2. ఇప్పుడు స్టవ్ పై కుక్కర్ పెట్టుకుని, నెయ్యి వేస, అందులోకి, మసాలాలు అన్ని వేయాలి.
3. మసాలాలు వేగిన తర్వాత పన్నీర్ ముక్కలు వేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపు కోవాలి.
4. వేగిన పన్నీర్ ను తీసి పక్కన పెట్టుకోవాలి.
5. ఇప్పుడు అదే కుక్కర్ లో మిగిలిన నెయ్యిలో, ఉల్లిపాయలు, చీలికలు వేపుకోవాలి.
6. ఉల్లిపాయ వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ , పసుపు, ఉప్పు, జీలకర్ర పొడి వేసి, కొద్దిగా నీళ్లు వేసి వేగనివ్వాలి.
7. వేగిన మసాలో టామాటో ముక్కలు ,బఠానీ వేసి మరో 3 నిముషాలు వేగనివ్వాలి.
8. ఇప్పుడు అందులోకి నానపెట్టుకున్న బాస్మతీ బియ్యం వేసి, నీళ్లు పోయేవరకు వేపుకోవాలి.
9. నీళ్లు, చెమ్మారిన తర్వాత, ఎసరు కోసం ఉంచిన నీళ్లను పోసి, పచ్చిమిర్చి, కొత్తిమీర తరుగు, వేపుకున్న పనీర్ ముక్కలు వేసుకుని, కలిపి, మూతపెట్టి, హై ఫ్లేమ్ పై రెండు విజిల్స్ రానివ్వాలి.
10. రెండు విజిల్స్ వచ్చిన తర్వాత 20 నిముషాలు కుక్కర్ ను పక్కన పెట్టుకోవాలి.
11. 20 నిముషాల తర్వాత కుక్కర్ మూత ఒపెన్ చేసి, నిమ్మరసంలో, ఊరపెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు, వడకట్టి, పలావ్ పైనే వేసి అడుగునుండి, కలుపుకోవాలి.
12. చల్లని రైతా తో సెర్వ్ చేసుకుంటే, వేడి వేడి పలావ్ అదిరిపోతుంది.
Click Here To Follow Chaipakodi On Google News