Kitchenvantalu

Miriyala Pulusu:ఈ సీజన్ లో ఘాటైన చిక్కని మిరియాల పులుసు.. రుచికరమైనది, ఆరోగ్యకరమైనది!

Miriyala Pulusu Recipe: వంటిల్లో మిరియాల ఉంటే, వంట్లోకి దగ్గు, జలుబు, రావాలంటేనే భయపడతాయి. చల్లని వాతావరణంలో ఘాటు ఘాటుగా, తమిళనాడు స్పెషల్ మిరియాల పులుసు చేసేయండి.

కావాల్సిన పదార్ధాలు
పులుసు పేస్ట్ కోసం..
మిరియాలు – 2 టీ స్పూన్ల్లు
ఎండుమిర్చి – 5
ధనియాలు – 2 టీ స్పూన్లు
మెంతులు – ¼ టీ స్పూన్లు
బియ్యం – 1 టీస్పూన్
పెసరపప్పు – 1 టీ స్పూన్
జీలకర్ర – 1 టీ స్పూన్
పచ్చి కొబ్బరి – 1/4కప్పు
కరివేపాకు – 1 రెబ్బ

పులుసు కోసం..
నూనె – 4 టేబుల్ స్పూన్స్
ఆవాలు – 1 టీ స్పూన్
కరివేపాకు -1 రెబ్బ
సాంబార్ ఉల్లిపాయలు – 125 గ్రాములు
ఇంగువ – కొద్దిగా
వెల్లుల్లి -8
ఉప్పు – తగినంత
పసపు – 1/4టీ స్పూన్
టమాటాలు -2
చింతపుండు పులుసు – 300ML
నీళ్లు – 400ML

తయారీ విధానం
1.పులుసు కారం తీసుకున్న పదార్దాలను దోరగా వేపుకోవాలి.
2. మంచి వాసన వస్తున్నప్పుడు పచ్చి కొబ్బరి , కరివేపాకు, వేసి, వేపుకుని, మిక్సీ జార్ లోకి తీసుకుని, కాసిన్ని నీళ్లు కలిపి మెత్తని పేస్ట్ లా చేసుకోవాలి.
3. ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టుకుని, నూనె వేసి, వెడెక్కిన తర్వాత, ఆవాలు, కరివేపాకు, ఇంగువ వేసుకుని,వేపాలి.
4. అందులోకి ఉల్లిపాయలు, ఉప్పు, పసుపు, వేసుకుని, మరికాసేపు ఫ్రై చేయాలి.

5. వేగిన ఉల్లిలో ,టమాటో ముక్కలు వేసి, మెత్తగా మగ్గనివ్వాలి.
6. మగ్గిన టమాటాల్లో చింతపండు పులుసు పోసి, రెండు పొంగులు రానివ్వాలి.
7. పొంగుతున్న చారులో, మిరియాల కారం పేస్ట్, నీళ్లు కలుపుకుని, బాగా మిక్స్ చేసి, మీడియం ఫ్లేమ్ పై , 15 నుంచి 20 నిముషాల మరగనివ్వాలి.
8. అంతే 20 నిముషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఘుముఘములాడే మిరియాల పులుసు రెడీ అయినట్లే..
Click Here To Follow Chaipakodi On Google News