Ratha Saptami 2024:రథసప్తమి ఎలా చేస్తున్నారు…ఇలా చేస్తే 7 జన్మల పాపాలు తొలగి సిరి సంపదలు,ఆయుర్ ఆరోగ్యాలు కలుగుతాయి
Ratha saptami 2024 : హిందువులు మాఘ శుద్ధ సప్తమి రోజున రథసప్తమి పండుగ జరుపుకుంటారు. పన్నెండు మాసములలోని సప్తమి తిథులకన్న మాఘమాసమందలి వచ్చే సప్తమి బాగా విశిష్టమైనది. రధసప్తమి రోజు సూర్యుణ్ణి పూజిస్తారు. సూర్య గమనం ప్రకారం ఉత్తరాయనము, దక్షిణాయనము అని రెండు విధములు.
ఆషాఢమాసము నుండి పుష్యమాసము వరకు దక్షిణాయనము. సూర్యరథం దక్షిణాయనంలో దక్షిణ దిశగా పయనిస్తుంది. తరువాత సూర్యుడు మకరరాశి ప్రవేశం ఉత్తరాయన ప్రారంభ సూచకముగా రథసప్తమి అని పేరు వచ్చింది. అందుకే ఈరోజు పవిత్రదినముగా భావించి భారతీయులు సూర్యుని ఆరాధిస్తారు. రధసప్తమి రోజు నుంచి వేసవికాలం ప్రారంభం అవుతుంది.
అందువల్ల రధసప్తమి రోజున తప్పనిసరిగా సూర్య నమస్కారాలు చేయాలి. ప్రపంచములో అన్ని జీవరాసులకు వేడి, వెచ్చదనము, పాడిపంటలను, వెలుగును ఇచ్చేవాడు సూర్యుడు. సూర్యుని ఆరాధన వేదాల కాలం నుండి ఉంది. అంతేకాక సూర్యుడు ఆరోగ్య ప్రదాత. సూర్య కిరణాలతో విటమిన్ డి ఉంటుంది. ఇది ఎన్నో ఆరోగ్య సమస్యలు రాకుండా చేస్తుంది.
ఈ రోజుల్లో నూటికి 90 శాతం మంది విటమిన్ డిం లోపముతో బాధపడుతూ ఉన్నారు. అటువంటి వారు ఉదయం ఎండలో ఒక అరగంట ఉంటే సరిపోతుంది. ఈ సప్తమి రోజు సూర్యుని ఆరాధన చేస్తే సంవత్సరం మొత్తం సూర్యుని పూజించిన ఫలితం వస్తుంది. సూర్యునికి రాగి పాత్ర ద్వారా అర్ఘ్యాన్నివ్వడం, ఎర్రచందనం, ఎర్రపువ్వులతో అర్చన చేయడం వంటివి ఈ రోజు తప్పనిసరిగా చేయాలి.
ఈ మాఘమాసం లో రథసప్తమి రోజున సూర్యుని పూజించి పాలు పొంగించడం కుదరని వారు ఒక ఆదివారం రోజున చేసిన మంచి ఫలితం ఉంటుందని మన పెద్దలు చెప్పుతున్నారు. రధసప్తమి రోజున కుదరలేదని పాలు పొంగించడం మానవలసిన అవసరం లేడి. ఆదివారం రోజున చేసుకోవచ్చు. రథసప్తమి రోజున సూర్యోదయానికి ముందే నిద్ర లేచి తలపై జిల్లేడు ఆకు పెట్టి దాని మీద రేగి కాయ పెట్టి తలస్నానము చేయాలి.
కుదిరిన వారు నదీ స్నానము చేస్తే మంచిది.ఇలా చేయటం వలన ఆమ్లగుణం గల రేగుపండూ, జిల్లేడు ఆకూ శిరస్సుకు ఎంతో మేలు చేస్తాయి. జిల్లేడు ఆకులోని రసాయనాలు జుట్టును గట్టిపరుస్తుంది. మేదని చల్లబరుస్తుంది. అంతేకాకుండా ఏడు జన్మల పాపాలు తొలగిపోతాయి.
రథసప్తమి రోజు ఆరుబయట(సూర్యకిరణాలు పడే చోట) తూర్పు దిక్కున తులసికోట పక్కగా ఆవు పేడతో అలికి,దానిపై వరిపిండితో పద్మం వేసి, ఆవుపేడతో చేసిన పిడకలతో పొయ్యి పెట్టి అంటించి, ఆవుపాలు పొంగించి,ఆ పాలల్లో కొత్తబియ్యం,బెల్లం,నెయ్యి,ఏలకులు వేసి పరమాన్నం తయారు చేస్తారు.
తులసికోట ఎదురుగా ఏడూ చిక్కుడుకాయలతో రథం చేసి చిక్కుడుఆకులపై పరమాన్నం ఉంచి దేముడికి నైవేద్యంగా పెడతారు . అయితే పిడకలతో చేయటం కుదరని వారు గ్యాస్ స్టవ్ ని శుభ్రం చేసుకుని పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆవుపాలు పొంగించి దానితో ప్రసాదం చేసి సూర్యునికి నైవేద్యం పెట్టవచ్చు.
రథసప్తమి నాడు దేముడికి ఎరుపు రంగు పువ్వులతో పూజ చేస్తే మంచిదట. చిమ్మిలి దానం ఇస్తే సకలశుభాలు చేకూరుతాయని ఒక నమ్మకం. రధసప్తమి రొజు స్త్రీలు ఎన్నో నోములు చెయటానికి ప్రారంబధినముగా చెయుదురు. అక్షింతలు వేసుకొని నోములకు నాంది పలుకుదురు.