Kitchenvantalu

Kitchen Hacks:మహిళల కోసం ప్రత్యేక వంటింటి చిట్కాలు..అసలు మిస్ కావద్దు

Telugu useful Kitchen Tips: వంటింటిలో కొన్ని చిట్కాలను ఫాలో అయితే వంట తొందరగా అవ్వటమే కాకుండా రుచికరంగా కూడా ఉంటుంది. ఇప్పుడు చెప్పే చిట్కాలను ఫాలో అవ్వటానికి ప్రయత్నం చేయండి.

గుడ్డు ఉడికించినప్పుడు ఒక్కోసారి గుడ్డు పెంకు తొందరగా రాదు. అదే బియ్యం కడిగిన నీటిలో కోడిగుడ్లను ఉడకబెడితే పెంకులు సులువుగా వస్తాయి.

పుదీనా పచ్చడి చేసేప్పుడు పెరుగు కలిపితే రుచిగా ఉండటమే కాకుండా పుదీనా వాసన కూడా కొంచెం తగ్గుతుంది. కొంత మంది పుదీనా వాసన కారణంగా తినటానికి ఇష్టపడరు. అలాంటి వారు ఇలా తింటే సరిపోతుంది.

కూరల్లో పులుపు తక్కువగా ఉంటే మామిడి పొడితో కొంచెం పెరుగుకలిపి కూరలో వేస్తే టమోటా రుచి వస్తుంది.

వంటింట్లో బొద్దింకల బెడద తగ్గిపోవాలంటే బోరిక్‌ పౌడర్‌ను మూలల్లో చల్లాలి. లేదంటే బొద్దింకలు ఉండే ప్రదేశంలో జల్లితే సరిపోతుంది.

కూరల్లో ఉప్పు ఎక్కువైతే కొబ్బరి ముక్క లేదా టమోటా ముక్కలు వేస్తే సరిపోతుంది.

ఫ్రిజ్‌లో పుదీనా ఆకులు ఉంచితే ఫ్రిజ్‌లో దుర్వాసన పోతుంది. అలాగే వంటింటిలో పెడితే పుదీనా వాసనకు ఈగలు కూడా రావు.
Click Here To Follow Chaipakodi On Google News