Kitchenvantalu

Boda Kakarakaya Dum Biryani:మీరెప్పుడు వినని తినని ఆకాకరకాయ బిర్యానీ.. తింటే వదిలిపెట్టరు

Boda Kakarakaya Dum Biryani Recipe: వానకాలంలో మాత్రమే దొరికే బోడకాకరకాయ ఆరోగ్యానికి ఎంత మంచిదో అందరికి తెల్సిందే. సీజన్ లో దొరికే బోడ కాకరకాయలతో ఎన్నో వెరైటీస్ చేసుకోవచ్చు. బోడ కాకరకాయతో కూరలే కాదు ,దమ్ బిర్యానీ కూడ చేసుకోవచ్చు.అదెలాగో చూసేద్దాం.

కావాల్సిన పదార్ధాలు
బోడకాకరకాయలు – ¼ kg
బాస్మతి బియ్యం – 2 కప్పులు
వేపిన ఉల్లిపాయలు – 1 కప్పు
కొత్తిమీర – 1 కప్పు
పుదీనా – 1 కప్పు
పెరుగు – ¼ కప్పు
ధనియాలు – 1 టేబుల్ స్పూన్
ఎండుమిర్చి – 6-7
మిరియాలు – ¼ టీ స్పూన్
ఎండు కొబ్బరి – 2 టేబుల్ స్పూన్స్
మెంథీ ఆకులు – 1 టేబుల్ స్పూన్
చింతపండు – 2 టేబుల్ స్పూన్స్
కారం – 1 టీ స్పూన్
గరం మసాలా – ½ స్పూన్
అల్లం వెల్లుల్లి పేస్ట్ – 1 ½ స్పూన్
పసుపు – ½ టీ స్పూన్
పాలు – ½ కప్పు
కుంకుమపువ్వు – 1/8 టీ స్పూన్
ఉప్పు – రుచికి సరిపడా
బటర్ లేదా నెయ్యి – 3 టేబుల్ స్పూన్స్
నూనె – 2 టేబుల్ స్పూన్

మసాలా కోసం..
బిర్యానీ ఆకు – 2-3
షాజీరా – 1 టీ స్పూన్
దాల్చిన చెక్క – 2-3 ఇంచులు
లవంగాలు – 5-6
యాలకులు – 4
అనాస పువ్వు – 1

తయారీ విధానం
1.బాస్మతి బియ్యాన్ని కడిగి అరగంట పాటు నానబెట్టుకోవాలి.
2.బోడకాకరకాయలను కట్ చేసుకోని విత్తనాలు పండినట్లయితే తీసేసుకోవాలి.
3.ఇప్పుడు బిర్యానీ మసాల కోసం ప్యాన్ వేడి చేసి అందులోకి టేబుల్ స్పూన్ ధనియాలు,జీలకర్ర,ఎండుమిర్చి,ఎండు కొబ్బరి వేసి వేపుకోని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
4.ఇప్పుడు అందులోకి మెంతులు కూడ వేసుకోని అన్నింటి మిక్సిజార్ లో వేసుకోని గ్రైండ్ చేసుకోవాలి.
5.ఇప్పుడు స్టవ్ పై బాండీ పెట్టుకోని నూనె వేడి చేసి బోడకాకరకాయ ముక్కలను వేపుకోవాలి.
6.గట్టిగా ఉన్నట్లయితే ఉడికించుకోవచ్చు.
7.ఇప్పుడు వేపుకున్న కాకరకాయలు రంగు మారేవరకు వేపుకోని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
8.ఇప్పుడ ఒక మిక్సింగ్ బౌల్ లోకి పెరుగు ,చింతపండు గుజ్జు,ఉప్పు,కారం,గ్రైండ్ చేసిన మసాలా పొడి ,గరం మసాలా,అల్లం వెల్లుల్లి పేస్ట్ ,ఎండుమిర్చి,పసుపు వేసి కలుపుకోవాలి.

9.అందులోకి వేపుకున్న బోడకాకరకాయ ముక్కలు వేసి కలుపుకోవాలి.
10.తర్వాత వేపుకున్న ఉల్లిపాయ ముక్కలు,కొత్తిమీర,పుదీనా వేసుకోని కాసేపు పక్కన పెట్టుకోండి.
11.ఈలోపు అన్నం కోసం ప్యాన్ లో సగానికి పైగా నీళ్లతో నింపి అందులోకి 1 టీ స్పూన్ ఉప్పు,బిర్యానీ ఆకు,షాజీరా,దాల్చిన చెక్క ,లవంగాలు,యాలకులు,పువ్వు వేసుకోని ఎసరు మరగనివ్వాలి.
12. మరుగుతున్న ఎసరులో నానా బెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని వేసుకోవాలి.
13.అన్నం 70 శాతం ఉడికిచాక అన్నాన్ని వడకట్టుకోవాలి.
14.ఇప్పుడ దం కోసం మందపాటి బాండీ తీసుకోని అడుగున నెయ్యి లేదా,బటర్ రాసుకోవాలి.
15.ముందుగా కలిపి పెట్టుకున్న బోడకాకరకాయ మసాల మిశ్రమాన్ని వేసుకోవాలి.
16.తరువాత కొద్దిగా నీరు వేసి ఉడికిన బియ్యాన్ని వేసుకోవాలి.
17.బియ్యం పై కొత్తిమీర,పుదీనా వేయించి పెట్టుకున్న ఉల్లిపాయలు చల్లుకోవాలి.
18.ఆపై పై బటర్ లేదా నెయ్యి చల్లుకోవాలి.
19.తర్వాత అందులోకి పాలను కూడ వేసుకోవాలి.
20.ఇప్పుడు బాండీలోంచి ఆవిరి బయటకు రాకుండా మూత పెట్టుకోని పిండితో అంచులను మూసివేయాలి.
21.ఇప్పుడు బాండీని స్టవ్ పై పెట్టి 5 నిమిషాలు హై ఫ్లేమ్ పై తర్వాత 5 నిమిషాలు లో ఫ్లేమ్ పై ఉడికించాలి.ఇప్పుడు స్టవ్ పై మందపాటి ప్యాన్ పెట్టి దాని పై బిర్యానీ బాండీనుంచి హై ఫ్లేమ్ పై మరో ఎనిమిది నిమిషాలు ఉడకనివ్వాలి.
22.స్టవ్ ఆఫ్ చేసుకోని ఐదు నిమిషాల తర్వాత సర్వ్ చేసుకుంటే ఘుమ ఘుమలాడే బోడకాకరకాయ బిర్యానీ రెడీ.