Beauty TipsHealth

Lice:ఈ చిట్కాలు పాటిస్తే పేలు నిమిషంలో రాలిపోతాయి

Head lice Remove Home Remedies in Telugu : పేలు తలలో వెంట్రుకలను అంటిపెట్టుకొని రక్తాన్ని ఆహారంగా తీసుకొని జీవిస్తున్న చిన్న పరాన్నజీవులు. ఇది పిల్లల్లో ఒక సాధారణ సమస్యగా ఉంటుంది. దురద,గోకటం వలన నెత్తిమీద చర్మంనకు చికాకు మరియు ఎక్కువగా బాధ కలుగుతుంది. తలలో పేల కోసం కఠినమైన రసాయనాలు కాకుండా సమర్ధవంతమైన ఇంటి చిట్కాలు ఉన్నాయి.
How to remove head lice In Telugu
వెల్లుల్లిలో ఉండే బలమైన వాసన పేలను తొలగించుకోవటానికి చాలా బాగా పనిచేస్తుంది. వెల్లుల్లి రెబ్బలను మెత్తని పేస్ట్ గా చేసి దానిలో నిమ్మరసం కలిపి తలకు పట్టించాలి. అరగంట అయ్యాక గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి. జుట్టు కాస్త తడిగా ఉన్నప్పుడే దువ్వెనతో దువ్వితే పేలు రాలిపోతాయి.
garlic
రాత్రి పడుకోవటానికి ముందు కొంచెం వైట్ వెనిగర్ తీసుకోని తలకు బాగా పట్టించి షవర్ క్యాప్ లేదా టవల్ తో మీ తలను కవర్ చేయాలి. రాత్రి అలా వదిలేసి మరుసటి రోజు ఉదయం షాంపూ తో తలస్నానం చేయాలి. జుట్టు కాస్త తడిగా ఉన్నప్పుడే దువ్వెనతో దువ్వితే పేలు బయటకు వస్తాయి.
Tea Tree Oil
టీ ట్రీ ఎసెన్షియల్ నూనె ఒక సహజ క్రిమి సంహారి. తలలో పేలను వదిలించుకోవటానికి చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. కొబ్బరి లేదా ఆలివ్ నూనె తో టీ ట్రీ ఆయిల్ ని కలిపి మీ నెత్తి మీద చర్మం అంతటా పట్టించి ఒక షవర్ క్యాప్ తో మీ తలను కవర్ చేయాలి. ఒక అరగంట తర్వాత వేడి నీటితో పూర్తిగా శుభ్రం చేయాలి. జుట్టు కాస్త తడిగా ఉన్నప్పుడే దువ్వెనతో దువ్వితే పేలు రాలిపోతాయి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.