Turmeric and cardamom:యాలకులు+పసుపు కలిపి తీసుకుంటే శరీరంలో ఏమి జరుగుతుందో తెలుసా ?
Turmeric and cardamom benefits : యాలకులు,పసుపు రెండింటిలోను ఎన్నో పోషకాలు,ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ రెండింటినీ కలిపి తీసుకుంటే రెట్టింపు ప్రయోజనాలు కలుగుతాయి. పొయ్యి మీద గిన్నె పెట్టి ఒక గ్లాసు నీటిని పోసి ఒక యాలక్కాయ చితక్కొట్టి వేయాలి. ఆ తర్వాత పావుస్పూన్ లో సగం పసుపు వేసి 5 నిమిషాలు మరిగించాలి.
మరిగిన ఈ నీటిని వడకట్టి ఉదయం సమయంలో తాగితే దగ్గు,జలుబు,గొంతునొప్పి వంటీ వాటి నుండి ఉపశమనం కలుగుతుంది. జీర్ణ సంబంద సమస్యలు అయిన అజీర్ణం, గ్యాస్ మరియు మలబద్ధకం వంటివి ఏమి లేకుండా చేస్తుంది. యాంటీమైక్రోబయల్ లక్షణాలు ఉండుట వలన నోటి దుర్వాసనకు కారణం అయిన బ్యాక్టీరియాతో పోరాటం చేస్తుంది.
దాంతో నోటి దుర్వాసన సమస్య కూడా తగ్గుతుంది. ఈ సమస్య ఉన్నవారు బయటకు వెళ్లినప్పుడు ఈ నీటిని తాగితే మంచి ఫలితం ఉంటుంది. యాంటీ బాక్టీరియల్ మరియు యాంటీ వైరల్ లక్షణాలు,యాంటీఆక్సిడెంట్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉండుట వలన శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.