Grey Hair : ఇంట్లోనే తయారు చేసిన ఈ ప్యాక్‌తో తెల్లజుట్టు నల్లగా మారుతుంది..
Gray HAir/White Hair Turn Black : ఈ రోజు చెప్పే ప్యాక్ జుట్టుకి సంబందించిన అన్నీ రకాల సమస్యలను తగ్గించటానికి చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది. ముఖ్యంగా తెల్లజుట్టు సమస్య ఉన్నవారు ఈ ప్యాక్ వేసుకుంటే తెల్లజుట్టు మొత్తం నల్లగా మారుతుంది. తెల్లజుట్టు రాగానే అందరూ చాలా కంగారూ పడుతూ ఉంటారు. అలా కంగారూ పడకుండా ఇంటి చిట్కాలను ఫాలో అయితే మంచి ఫలితాలను పొందవచ్చు.
ఒక బౌల్ లో ఒక స్పూన్ Bhringraj పొడి,ఒక స్పూన్ కరివేపాకు పొడి, ఒక స్పూన్ ఉసిరి పొడి,పావు స్పూన్ లవంగాల పొడి,ఒక స్పూన్ హెన్నా పొడి,ఒక స్పూన్ పెరుగు, ఒక స్పూన్ బాదం ఆయిల్ వేసి నీటిని పోస్తూ పేస్ట్ గా కలుపుకోవాలి. ఈ పేస్ట్ ని జుట్టు కుదుళ్ల నుండి చివర్ల వరకు పట్టించాలి.
అరగంట అయ్యాక కుంకుడు కాయలు లేదా షాంపూతో తలస్నానం చేయాలి. ఈ విధంగా చేస్తే జుట్టు రాలకుండా ఒత్తుగా పొడవుగా పెరగటమే కాకుండా మృదువుగా కాంతివంతంగా మారుతుంది. అలాగే తెల్లజుట్టు నల్లగా మారుతుంది. తెల్లజుట్టు సమస్య ఉన్నవారు వారంలో రెండు సార్లు ఈ విధంగా చేస్తే చాలా మంచి ఫలితం వస్తుంది.
ఈ ప్యాక్ లో ఉపయోగించిన అన్నీ ఇంగ్రిడియన్స్ అన్నీ సహజసిద్దమైనవి. కాబట్టి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా తెల్లజుట్టును నల్లగా మార్చు కోవచ్చు. అలాగే జుట్టు రాలే సమస్య,చుండ్రు సమస్య ఇలా అన్నీ రకాల సమస్యలు తొలగిపోతాయి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.