Kitchenvantalu

Bittergourd chips:సంవత్సరం పాటు నిల్వ ఉండే కాకరకాయ ఒరుగులు…చేదు అసలు ఉండదు

Bittergourd chips Recipe : కాకరకాయ చేదుగా ఉంటుందని చాలా మంది తినటానికి ఇష్టపడరు. కాకరకాయలో ఎన్నో పోషకాలు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కాకరకాయ డయాబెటిస్ ఉన్నవారికి చాలా లాభాన్ని అందిస్తుంది. కాకరకాయ ఒరుగులను ఈ విధంగా చేసుకుంటే దాదాపుగా సంవత్సరం పాటు నిల్వ ఉంటాయి.

కావలసిన పదార్ధాలు
కాకరకాయలు 1 కేజీ

తయారి విధానం
కాకరకాయలను శుభ్రంగా కడిగి పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేయాలి. ముక్కలను ఎండబెట్టిన తర్వాత చిన్నగా అవుతాయి. కాబట్టి కాకరకాయను పెద్ద ముక్కలుగా కట్ చేయాలి. ఈ ముక్కలను మూడు లేదా నాలుగు రోజుల పాటు ఎండలో ఎండబెట్టాలి.

వీటిని డబ్బాలో పొడి నిల్వ చేస్తే దాదాపుగా సంవత్సరం పాటు నిల్వ ఉంటాయి. వీటిని నూనెలో వేగించి తింటే చాలా బాగుంటాయి. సాంబార్‌ అన్నంతో తింటే చాలా బాగుంటాయి. గాలి చొరబడని కంటైనర్‌లో నిల్వ చేస్తే పురుగు పట్టకుండా సంవత్సరం పాటు నిల్వ ఉంటాయి.