Black Gram Rice:మిగిలిపోయిన అన్నంతో చిటికెలో అయిపోయే లంచ్ బాక్స్ రెసిపీ
Black Gram Rice Recipe :వడ, దోశ, టిఫిన్స్ లోకి మినపప్పుతో, అన్నం ఎలా తయారు చేయాలో చూసేద్దాం. తరతరాలుగా ఆంధ్రులు నచ్చిమెచ్చి చేసుకునే వంటకం
మీరు కూడూ చూసేయండి.
కావాల్సిన పదార్ధాలు
మిపపప్పు పొడి కోసం..
పొట్టుమినపప్పు – 1/4కప్పు
ధనియాలు – 1 టేబుల్ స్పూన్
ఎండుమిర్చి – 8 నుంచి 10
పచ్చికొబ్బరి ముక్కలు – 1/4కప్పు
చింతపండు – 2 రెబ్బలు
నెయ్యి – 1 టేబుల్ స్పూన్
అన్నం కోసం..
వండిన అన్నం – 1 కప్పు
నెయ్యి – 2 టేబుల్ స్పూన్స్
ఆవాలు – 1 టీ స్పూన్
జీలకర్ర – 1 టీ స్పూన్
ఎండుమిర్చి – 2
కరివేపాకు – 2 రెబ్బలు
ఉప్పు – తగినంత
ఇంగువ – కొద్దిగా
తయారీ విధానం
1.స్టవ్ పై ఒక కడాయి పెట్టుకుని, అందులోకి నెయ్యి వేసి, వేడెక్కిన తర్వాత,మినపప్పు వేసుకుని, దోరగా వేయించుకోవాలి.
2.పప్పు వేగిన తర్వాత , మినపప్పు పొడి కోసం ఉంచుకున్న పదార్ధాలు అన్ని వేసి,ఎర్రగా వేయించుకోవాలి.
3.వేగిన పప్పును, చింతపండును, మిక్సీ జార్లోకి వేసుకుని, మెత్తని పొడి చేసుకోవాలి.
4. ఇప్పుడు స్టవ్ పై వేరొక బాండీ పెట్టుకుని, నెయ్యి వేడి చేసి, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఇంగువ, కరివేపాకు, ఒకోక్కటిగా వేసి, తాళింపు వేసుకోవాలి.
5. వేగిన తాళింపులోకి, గ్రైండ్ చేసుకున్న మినప్పొడిని, ఉప్పును కూడా వేసుకుని, ఒక నిముషం పాటు వేపుకోవాలి.
6. ఇప్పుడు వండి పెట్టుకున్న అన్నాన్ని, వేపుకున్న పొడిలో వేసి, కలిసేలా బాగా మిక్స్ చేసుకుంటే, ఘుమఘములాడే మినపప్పు అన్నం రెడీ.
Click Here To Follow Chaipakodi On Google News