Cauliflower Methi Curry:కమ్మని చిక్కని గ్రేవీతో అదిరిపోయే కాలీఫ్లవర్ మెంతి కూర
Cauliflower Methi Curry Recipe:ఎప్పుడూ స్పైసీ స్పైసీ మసాలా కూరలే కాదు. అప్పుడప్పుడు ఆరోగ్యానికి, అరుగుదలకు, ఉపయోగపడే వంటకాలు కూడా చేసుకోవాలి. నోటికి కమ్మగా, పొట్టకు హాయిగా ఉండే, గోబి పువ్వు, మెంతికూరను పాలతో కలపి వండండి. ఎంత రుచిగా ఉంటుందో..
కావాల్సిన పదార్ధాలు
కాలీ ఫ్లవర్ ముక్కలు – 300 గ్రాములు
క్యారేట్ ముక్కలు – 1/2కప్పు
గ్రేవీ కోసం..
నూనె – 1.5 టీ స్పూన్
ఉల్లిపాయ ముక్కలు – 1 కప్పు
పచ్చిమిర్చి – 4
అల్లం – 1 ఇంచ్
వెల్లుల్లి – 4
పచ్చికొబ్బరి – 1/2కప్పు
ఉప్పు – తగినంత
పాలు – 300ML
కూర కోసం ..
నూనె – 1.5 టీ స్పూన్
జీలకర్ర – 1 టీ స్పూన్
మెంతికూర కట్టలు – 3
నెయ్యి – 2 టీ స్పూన్స్
తయారీ విధానం
1.ముందుగా కుక్కర్ లోకి కాలీ ఫ్లవర్ ముక్కులు, క్యారేట్ ముక్కలు వేసి, తగినన్ని నీళ్లు పోసి, హై ఫ్లేమ్ పై రెండు విజిల్స్ రానివ్వాలి.
2. ఇప్పుడు స్టవ్ పై వేరొక బాండీ పెట్టుకుని, నూనె వేసి, వేడెక్కిన తర్వాత, గ్రేవీ కోసం పెట్టుకున్న పదార్ధాలు అన్ని, వేసుకుని ఉల్లిపాయలు మెత్తపడే వరకు, వేగనిచ్చి, పచ్చికొబ్బరి కూడా వేసి వేపుకోవాలి.
3. వేగిన ఈ పదార్ధాలు అన్ని మిక్సీ జార్ లోకి తీసుకుని, కొద్దిగా నీళ్లు వేసి, ఉప్పుతో పాటు, మెత్తని పేస్ట్ చేసుకోవాలి.
4. మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఈ పేస్ట్ లో, పాలు పోసి కలిపి పక్కన పెట్టుకోవాలి.
5. స్టవ్ పై బాండీ పెట్టుకుని, నూనె వేడి చేసి, అందులో జీలకర్ర వేసి, చిటపటలాడనివ్వాలి.
6. ఇప్పుడు అందులోకి గ్రేవీ కోసం రెడీ చేసుకున్న పాలు పేస్ట్ వేసుకుని, మీడియం ఫ్లేమ్ పై , 15 నిముషాలు ఉడగనివ్వాలి.
7. గ్రేవీ కాస్త చిక్కబడ్డాక, ఉడికించిన క్యారేట్ ముక్కలు, మెంతికూర వేసి, బాగా కలిపి, మూత పెట్టుకుని, 15 నిముషాలు మగ్గనివ్వాలి.
8. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి.
9.ఇక చివరగా కొద్దిగా నెయ్యి వేసి, గ్రేవీని బాగా కలుపుకుని, స్టవ్ ఆఫ్ చేసుకుంటే, కాలీ ఫ్లవర్ మెంతికూర రెడీ.
Click Here To Follow Chaipakodi On Google News