White HAir:హెయిర్ డై లు కాదు.. ఈ ప్యాక్ వేసుకుంటే తెల్లజుట్టు నల్లగా మారడం ఖాయం!
white hair Home Remedies in telugu :తెల్లజుట్టు సమస్య అనేది ఈ రోజుల్లో చాలా చిన్న వయస్సులోనే వచ్చేస్తుంది. దాంతో చాలా కంగారు పడిపోయి మార్కెట్ లో దొరికే రకరకాల హెయిర్ డ్రై లను వాడుతూ ఉంటారు. అలా వాడకుండా మన ఇంటిలో దొరికే సహజసిద్దమైన పదార్ధాలతో సులభంగా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా తెల్లజుట్టును నల్లగా మార్చుకోవచ్చు.
ఈ చిట్కా కోసం కేవలం 4 పదార్ధాలను ఉపయోగిస్తున్నాం. ముందుగా పొయ్యి వెలిగించి ఒక గ్లాస్ నీటిని పోసి దానిలో ఒక స్పూన్ కాఫీ పొడి వేయాలి. కాఫీ నీటిలో బాగా మరిగాక ఆ నీటిని ఒక బౌల్ లోకి తీసుకొని దానిలో 4 లవంగాలను పొడి చేసి వేయాలి.
ఆ తర్వాత 2 స్పూన్ల గోరింటాకు పొడి,ఒక స్పూన్ ఉసిరి పొడి వేసి బాగా కలిపి అరగంట అలా వదిలేయాలి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని తలకు బాగా పట్టించి అరగంట అయ్యాక తేలికపాటి షాంపూతో తలస్నానం చేయాలి. ఈ విధంగా వారంలో 2 సార్లు చేస్తూ ఉంటే క్రమంగా తెల్లజుట్టు నల్లగా మారుతుంది.
చాలా తక్కువ ఖర్చుతో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా తెల్ల జుట్టును నల్లగా మార్చుకోవటమే కాకుండా జుట్టు రాలే సమస్య తగ్గి జుట్టు ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. కాబట్టి ఈ చిట్కాను ఫాలో అవ్వండి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.