Kitchenvantalu

Neella charu:ఆంధ్రా స్పెషల్ నీళ్ల చారు.. ఇలా చేస్తే అసలు వదిలిపెట్టకుండా తింటారు

Neella charu Recipe: గంటలు గంటలు చేసే వంటలకన్నా చిటికెలో చేసే చారు భలే రచిగా అనిపిస్తుంది.అన్ని కూరల్లోకి కాస్త చారు కలిపితేనే భోజనం పూర్తయినట్టు అనిపిస్తుంది.సింపుల్ గా చిటికెలో చేసే చారు తయారి చూసేయండి.

కావాల్సిన పధార్ధాలు
చింతపండు నీళ్లు- 750 ML
ధనియాలు – 3 టేబుల్ స్పూన్స్
ఎండుమిర్చి- 5-6
జీలకర్ర- 1 టీస్పూన్
మిరియాల పొడి- 1 టీస్పూన్
కరివేపాకు కాడలతో – 2
పసుపు- ½ టీస్పూన్
ఉప్పు- తగినంత
పచ్చిమిర్చి- 4

తాలింపు కోసం
నూనె- 1.5 టీస్పూన్
ఆవాలు ½ టీస్పూన్
జీలకర్ర – ½ టీస్పూన్స్
ఇంగువ – ½ టీస్పూన్
ఎండుమిర్చి-1

తయారి విధానం

1.స్టవ్ పై గిన్నెను పెట్టుకోని చారు కోసం ఉంచిన పధార్ధాలన్ని వేసుకోని మూత పెట్టి మీడియం ఫ్లేమ్ పై పదిహేను నిమిషాలు మరగించాలి.
2.తరువాత తాలింపు కోసం స్టవ్ పై ప్యాన్ పెట్టుకోని నూనె వేడి చేసి ఆవాలు,జీలకర్ర, ఎండుమిర్చి వేసి చివరగా ఇంగువ వేసుకోని వేగిన తాలింపును మరుగుతున్న చారులో వేసుకోవాలి
3.ఒక్క పొంగు రాగనే స్టవ్ ఆఫ్ చేసుకోని రుచి చూసుకుంటే వేడి వేడి నీళ్ల చారు రెడీ..
Click Here To Follow Chaipakodi On Google News