Ginger Water:పరగడుపున వేడి నీటిలో అల్లం రసం కలిపి తాగుతున్నారా.. ముఖ్యంగా ఈ సీజన్ లో…
Ginger water Health benefits in telugu : ఈ మధ్య కాలంలో మారిన పరిస్థితి కారణంగా ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పట్ల శ్రద్ధను పెడుతూ మంచి పోషకాలు ఉన్న ఆహారాన్ని తీసుకుంటున్నారు. ఈ సీజన్ లో శరీరంలో రోగనిరోధక వ్యవస్థ బలంగా ఉంటె ఎటువంటి సమస్యలు రావు. అందువల్ల ఈ సీజన్ లో అల్లంను రెగ్యులర్ గా తీసుకుంటే మంచిది.
ఘాటైన వాసన రుచి కలిగిన అల్లంను మనం ప్రతిరోజు వంటలలో వేసుకుంటూ ఉంటాం.అల్లం లేకపోతే ఆ వంటకు రుచి ఉండదు. అల్లంలో క్యాల్షియం, మెగ్నీషియం, పొటాషియం,విటమిన్ సి,ఫైబర్,యాంటీ ఆక్సిడెంట్స్, ప్రోటీన్స్ సమృద్ధిగా ఉంటాయి.ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అయితే ఈ ప్రయోజనాలు అనేవి తీసుకునే సమయాన్ని బట్టి కూడా మారుతూ ఉంటాయి.
ముఖ్యంగా పరగడుపున తీసుకుంటే ఎక్కువ ప్రయోజనాలను పొందవచ్చు. పరగడుపున చిన్న అల్లం ముక్క లేదా అల్లం రసం తీసుకుంటే శరీరంలో అధికంగా ఉన్న నీరు బయటకు వెళ్ళిపోతుంది. ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో ఒక స్పూన్ అల్లం రసం కలిపి తాగితే సరిపోతుంది. అలాగే ఉదయం సమయంలో ఉండే నీరసం, అలసట వంటివి లేకుండా హుషారుగా ఉండటమే కాకుండా రోజంతా చురుకుగా పనులను చేసుకుంటారు.
గ్యాస్ ఎసిడిటీ,మలబద్ధకం,కడుపుబ్బరం వంటి సమస్యలు ఉన్నవారు చిన్న అల్లం ముక్కను తేనెతో కలిపి తీసుకుంటే జీర్ణ వ్యవస్థ పనితీరు బాగుండి ఆ సమస్యల నుంచి బయటపడతారు. కీళ్ల నొప్పులు ఉన్నవారికి కూడా మంచి ఉపశమనం కలుగుతుంది. అలాగే నోటి దుర్వాసన సమస్య కూడా తొలగిపోతుంది దగ్గు, జలుబు, గొంతు నొప్పి వంటివి కూడా ఉండవు.
ముఖ్యంగా ఇప్పుడు ఉన్న పరిస్థితిలో ప్రతి రోజు అల్లం తీసుకుంటేనే మంచిది. శరీరంలో రోగనిరోదక శక్తిని పెంచుతుంది. అప్పుడే ఇన్ ఫెక్షన్స్ నుంచి మనకు రక్షణ కలుగుతుంది. అల్లంలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్లు సమృద్దిగా ఉండుట వలన దగ్గు, జలుబు, గొంతు నొప్పి నుంచి త్వరగా ఉపశమనం కలుగుతుంది. కాబట్టి అల్లంను తీసుకోవటానికి ప్రయత్నం చేయండి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.