Kitchenvantalu

Egg Boiling Tips:గుడ్లు ఉడకబెట్టినప్పుడు పగిలిపోతున్నాయా…అయితే ఈ టిప్స్ ఫాలో అవ్వండి

Prevent eggs from cracking from boiling in telugu:మనలో చాలా మంది ఉదయం సమయంలో గుడ్డును ఉడికించి తింటూ ఉంటారు. ఉడికిన గుడ్డు తింటే మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. అయితే ఇలా గుడ్డు ఉడికించినప్పుడు గుడ్లు మధ్యలో పగిలిపోవడం లేదంటే తెల్లసొన బయటకు రావడం జరుగుతూ ఉంటుంది.

ఇలా కాకుండా ఇప్పుడు చెప్పే చిట్కాలను పాటిస్తే గుడ్లు ఉడకపెట్టినప్పుడు పగిలిపోకుండా ఉంటాయి. మార్కెట్ నుంచి తెచ్చుకున్న గుడ్లను ఫ్రిజ్ లో పెడుతూ ఉంటాం. అలా ఫ్రిజ్లో నుంచి తీసిన వెంటనే నేరుగా ఉడికించేస్తారు. ఇలా చేయటం వలన గుడ్లు పగిలిపోయే ప్రమాదం ఉంది. ఫ్రిజ్ నుంచి గుడ్డు బయట పెట్టాక సాధారణ గది ఉష్ణోగ్రతకు వచ్చాక అప్పుడు ఉడికించాలి. అప్పుడు పగలకుండా ఉంటుంది.

గుడ్లను ఉడికించినప్పుడు చిన్న పాత్ర అయితే మూడు లేదా నాలుగు గుడ్లను మాత్రమే ఉడకబెట్టాలి. ఎందుకంటే నీరు మరిగినప్పుడు ఒక గుడ్డు మరొక దానితో ఢీకొని పగిలిపోయే ప్రమాదం ఉంది. గుడ్లు ఉడికించినప్పుడు నీటిలో వెనిగర్ వేస్తే గుడ్లు పగలకుండా ఉడుకుతాయి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.