Kitchenvantalu

Pizza Bread Samosa:సమోసాను ఎప్పుడైనా ఇలా చేసారా.. రుచి చూస్తే అసలు వదిలిపెట్టరు

Pizza Bread Samosa Recipe: పిజ్జా, బ్రెడ్ , సమోసా, విడివిడిగా, అందరం టేస్ట్ చేస్తూనే ఉంటాం. పైగా అందిరికి ఫేవరేట్ ఫుడ్ కూడా. కాని, ఈ పిజ్జా, బ్రేడ్ ను కలిపి, సమోసా చేసి చూడండి. టేస్ట్ డబుల్ అయిపోతుంది.

కావాల్సిన పదార్ధాలు
శాండ్ విచ్ బ్రెడ్ -15

స్టఫ్పింగ్ కోసం
ఎల్లో క్యాప్సికమ్ తరుగు – 2 టీ స్పూన్స్
గ్రీన్ క్యాప్సికమ్ తరుగు – 2 టీ స్పూన్స్
రెడ్ క్యాప్సికమ్ తరుగు – 2 టీ స్పూన్స్
స్వీట్ కార్న్ – 2 టీ స్పూన్స్
పిజ్జా సీసనింగ్ – 1/2టీస్పూన్
పిజ్జా సాస్ – 1 1/2టీస్పూన్
ఉప్పు – కొద్దిగా
మిరియాల పొడి – 1/4టీస్పూన్
చిల్లీ ఫ్లేక్స్ – 1/2టీస్పూన్
అలెప్పీనోస్ – 1 టేబుల్ స్పూన్
మోజరెల్లా ఛీజ్ – 1.5 కప్పు
దేశీ ఆకుల తరుగు – 1 టేబుల్ స్పూన్ ( ఆప్షనల్)
నూనె – వేపుకోడానికి

ఇప్పుడు సీలింగ్ కోసం..
మైదా – 1 టేబుల్ స్పూన్
నీళ్లు – తగినన్ని

తయారీ విధానం
1.స్టఫ్పింగ్ కోసం పెట్టుకున్న పదార్ధాలు అన్నిటిని ఒక గిన్నెలో వేసుకుని, కలిపి పక్కన పెట్టుకోండి.
2. ఇప్పుడు బ్రెడ్ అంచులను తీసేసి, పల్చని షీట్ లాగా, చపాతి కర్రతో రోల్ చేసుకోవాలి.
3. బ్రెడ్ షీట్స్ ను, సమోసా షేప్స్ లాగా, ట్రైయాంగిల్ షేప్ లో కట్ చేసేయాలి.
4. ఇఫ్పుడు వేరొక గిన్నెలో మైదా వేసి, నీళ్లు కలిపి, చిక్కని పేస్ట్ లా తయారు చేసుకోవాలి.
5. ఇప్పుడు కట్ చేసుకున్న సమోసా షీట్స్ అంచులకు మైదా పూసి పెట్టాలి.

6. తర్వాత అందులోకి స్టఫ్పింగ్ కొద్దిగా పెట్టి, మూలలను, గట్టిగా అదిపి పెట్టి, మధ్యకు మడిచి సీల్ చేసుకోవాలి.
7. ఏదైనా పగుళ్లు ఉన్నట్లు అయితే మైదాతో కవర్ చేయాలి.
8. ఇప్పుడు అన్ని సమోసాలను తయారు చేసుకుని, పక్కన పెట్టుకోవాలి.
9. ఇఫ్పుడు స్టవ్ పై కడాయి పెట్టుకుని, డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని, నూనె వేడెక్కిన తర్వాత, తయారు చేసుకున్న సమోసాలను వేసి ఎర్రగా కాల్చుకోవాలి.
10. అంతే పిజ్జా బ్రెడ్ సమోసా రెడీ.
Click Here To Follow Chaipakodi On Google News